https://oktelugu.com/

Hari Teja: ఆ డైరెక్టర్ పై నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ – హరితేజ

Hari Teja: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’ సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తోంది. ఐతే, ‘ఎఫ్ 2’లో నటి హరితేజ కీలక పాత్ర పోషించింది. కాగా ఎఫ్ 3 లోనూ హరితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి భాగంలో ఆమె మంచి కామెడీ రోల్ లో నటించారు. మరి రెండో భాగంలో కూడా అదే పాత్రలో కనిపించాలి కదా. అందుకే.. అలాగే నటిస్తున్నా […]

Written By:
  • Shiva
  • , Updated On : May 8, 2022 / 06:03 PM IST
    Follow us on

    Hari Teja: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’ సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తోంది. ఐతే, ‘ఎఫ్ 2’లో నటి హరితేజ కీలక పాత్ర పోషించింది. కాగా ఎఫ్ 3 లోనూ హరితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి భాగంలో ఆమె మంచి కామెడీ రోల్ లో నటించారు. మరి రెండో భాగంలో కూడా అదే పాత్రలో కనిపించాలి కదా.

    Hari Teja

    అందుకే.. అలాగే నటిస్తున్నా అంటూ హరితేజ తాజాగా చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ సినిమా గురించి హరితేజ ఏమి చెప్పింది అంటే.. “నా పాత్రలో మార్పులు లేవు. కథలో కొన్ని మార్పులు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది హరితేజ. ఐతే, ఈ సీక్వెల్ లో హరితేజ పాత్ర పెరిగిందా, తగ్గిందా? అనే విషయం గురించి కూడా ఆమె మాట్లాడింది.

    Also Read: Kishore Tirumala: ప్చ్.. ఒక్క ప్లాప్ కే ఆ డైరెక్టర్ కి ఫైనాన్సియల్ సమస్యలు

    హరితేజ మాటల్లోనే.. “మొదటి భాగం కన్నా రెండో దాంట్లో వినోదం పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఎఫ్ 3. అలాగే నా పాత్ర కూడా కొంత పెరిగింది’ అనేది హరితేజ మాట. ఇక పనిలో పనిగా హరితేజ దర్శకుడు అనిల్ రావిపూడిని, నిర్మాత దిల్ రాజుని తెగ పొగిడేశారు.

    దర్శకుడు అనిల్ రావిపూడి తనతో చాలా సరదాగా ఉంటాడు అని, ఇక ఆయన సినిమాల్లో వినోదం లార్జర్ థన్ లైఫ్ ఉంటుంది అని, ముఖ్యంగా అనిల్ రావిపూడి పాత్రలు మన జీవితాలను ప్రతిబింబిస్తాయి అని, అందుకే తనకు అనిల్ రావిపూడి అంటే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అని హరితేజ తెలిపింది.

    Hari Teja

    అదే విధంగా దిల్ రాజు గురించి ఏమి మాట్లాడింది అంటే.. దిల్ రాజు అంటేనే కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన బేన‌ర్‌లో న‌టించ‌డం ఆనందంగా ఉంది’ అని హరితేజ తెలియజేసింది.

    అన్నట్టు ఎఫ్ 3 సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. త‌మ‌న్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.

    Also Read:Husband Wife Relationship: భర్త ప్రేమను ఎలా పొందడానికి 6 రహస్యాలు ఇవే

    Recommended Videos:

    Tags