https://oktelugu.com/

Suriya- Director Bala Movie: కృతి శెట్టితో పాటు ఆమె కూడా రెడీ.. జ్యోతిక జోక్యం లేదు !

Suriya- Director Bala Movie: కొన్ని కలయికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి హిస్టరీ ఉంటుంది. అలాంటి హిస్టరీ ఉన్న కలయికే.. బాలా – హీరో సూర్య కాంబినేషన్. బాలా… హీరో సూర్యకి గురువు. ‘శివపుత్రుడు’, ‘నందా’ వంటి సినిమాలతో సూర్య కెరీర్ కి ఆయన ప్రాణం పోశారు. ఒక విధంగా సూర్య ఈ రోజు స్టార్ హీరోగా నిలబడ్డాడు అంటే కారణం బాలానే. సూర్యని హీరోగా నిలబెట్టారు బాలా. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 8, 2022 / 06:24 PM IST
    Follow us on

    Suriya- Director Bala Movie: కొన్ని కలయికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి హిస్టరీ ఉంటుంది. అలాంటి హిస్టరీ ఉన్న కలయికే.. బాలా – హీరో సూర్య కాంబినేషన్. బాలా… హీరో సూర్యకి గురువు. ‘శివపుత్రుడు’, ‘నందా’ వంటి సినిమాలతో సూర్య కెరీర్ కి ఆయన ప్రాణం పోశారు.

    Suriya, Krithi Shetty

    ఒక విధంగా సూర్య ఈ రోజు స్టార్ హీరోగా నిలబడ్డాడు అంటే కారణం బాలానే. సూర్యని హీరోగా నిలబెట్టారు బాలా. ఐతే, దర్శకుడిగా బాలా ఇప్పుడు ఫామ్ లో లేరు. కానీ, గతంలో తనకు ఎంతగానో సాయం చేసినా బాలాకి సూర్య పిలిచి మరీ సినిమా ఆఫర్ ఇచ్చాడు. ఇటీవలే ఆ సినిమా కన్యాకుమారిలో మొదలైన సంగతి తెలిసిందే.

    Also Read: Hari Teja: ఆ డైరెక్టర్ పై నాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ – హరితేజ

    ఐతే, లేటెస్ట్ కోలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక, జ్యోతిక ఈ సినిమాని పక్కన పెట్టింది అనేది ఆ వార్త సారాంశం. ఈ సినిమా ఆగిపోయినట్లే అనేది తాజా ప్రచారం. కానీ, అది అబద్దమని సూర్య టీం ప్రకటన విడుదల చేసింది. జ్యోతిక ఈ సినిమా విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదు అని మేకర్స్ స్పష్టం చేశారు.

    Suriya- Director Bala Movie

    వచ్చే నెలలో వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. అక్కడ సెట్ పనులు జరుగుతున్నాయి,” అని సూర్య టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోందని వార్తలు వచ్చాయి. కాగా కృతి శెట్టి నిజంగానే నటిస్తోంది. అలాగే కృతి శెట్టితో పాటు మరో ప్రత్యేక పాత్రలో రెజీనా కూడా నటిస్తోంది.

    రెజీనా పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందట. బాలా డైరెక్షన్లో నటిస్తే నటన వస్తుంది. ఆ విధంగా చూస్తే కృతితో పాటు రెజీనాకి ఈ సినిమా ముఖ్యం కానుంది. మరి బాలా చివరకు ఏమి చేస్తాడో చూడాలి.

    Also Read:Kishore Tirumala: ప్చ్.. ఒక్క ప్లాప్ కే ఆ డైరెక్టర్ కి ఫైనాన్సియల్ సమస్యలు

    Recommended Videos:

    Tags