కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులు

దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి సోకుతోంది. కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్-19 వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 17,265పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 543మంది మృతిచెందగా 2,547మంది కరోనా నుంచి బయటపడ్డారు. అయితే దేశంలో ఎక్కువ నమోదవుతున్న కేసుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై తొలిస్థానంలో నిలువడం శోచనీయంగా మారింది. ముంబైలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మహరాష్ట్రలో […]

Written By: Neelambaram, Updated On : April 20, 2020 4:51 pm
Follow us on


దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి సోకుతోంది. కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్-19 వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 17,265పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 543మంది మృతిచెందగా 2,547మంది కరోనా నుంచి బయటపడ్డారు. అయితే దేశంలో ఎక్కువ నమోదవుతున్న కేసుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై తొలిస్థానంలో నిలువడం శోచనీయంగా మారింది. ముంబైలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మహరాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా మహారాష్ట్రలో 53మంది జర్నలిస్టులకు కరోనా వచ్చినట్లు బీఎంసీ నిర్వహించిన టెస్టుల్లో తేలింది. మొత్తం 170మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు టెస్టులు చేయగా 53మందికి పాజిటిల్ వచ్చింది. టెస్టులు నిర్వహించడానికి ముందు వీరికి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలపడం గమనార్హం.

మ‌హారాష్ట్ర కరోనా దాటికి విలవిలలాడుతోంది. ఆదివారం ఒక్క‌రోజే రాష్ట్రంలో 552 వైర‌స్ పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఒక్కరోజులో పెద్దసంఖ్యలో కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో మ‌హారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,200లకు చేరింది. కరోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 223మంది మృతిచెందగా ఆదివారం 142మంది డిశార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,470గా ఉంది. కరోనా నుంచి మొత్తంగా 507మంది కోలుకున్నట్లు సమాచారం. చేరింది. అత్య‌ధికంగా ముంబైలో రెండు వేల‌కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నా తగ్గుముఖం పట్టడంలేదు. తాజాగా కరోనా లక్షణాలు లేకుండా కొత్తగా కేసులు నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.