కరోనావైరస్ లాక్ డౌన్ అమలులో భాగంగా రేపు (మంగళవారం) తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లేఖ ద్వారా తెలిపారు. సిఎం ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో సోమవారం ఉదయం కన్నుమూశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనావైరస్ లాక్ డౌన్ దృష్ట్యా సీఎం యోగి తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.యూపీ లో లాక్ డౌన్ నేపథ్యంలో రేపు ఉదయం ఉన్నతాధికారులతో కీలక భేటీ జరుగనుంది. కావున సీఎం యోగి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేరని అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని యోగి తన తల్లికి లేఖ ద్వారా తెలియజేసారు.
యోగి తండ్రికి కాలేయం మరియు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. తీవ్రమైన కాలేయ సంక్రమణ, డియాలసిస్ సమస్యతో మార్చి 13 ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి బిష్ట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో వెంటిలేటర్ సహాయంతో ఉన్నాడు. కాగా ఈ రోజు ఉదయం ఆయన మరణించారు.