https://oktelugu.com/

జర్నలిస్ట్ అరెస్ట్ వీడియో: ఇంత అరాచకమా?

జర్నలిస్ట్ రఘు అరెస్ట్ వీడియో బయటకు వచ్చింది. అసలు ఆ వీడియో చూస్తే మనం తెలంగాణలో ఉన్నామా? లేదా ప్రజాస్వామ్యం లేని ఉత్తరకొరియాలో ఉన్నామా? అన్న సందేహం కలుగకమానదు. ఎందుకంటే పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. దొంగలు దోపిడీదారుల్లో ఇద్దరు కండ కలిగిన వారు వచ్చి అందరూ చూస్తుండగానే.. మామిడి పండ్లు కొంటున్న జర్నలిస్టును నడిబజారులో అలా కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లడం తీవ్రసంచలనమైంది. ఆ వీడియో బయటకు వచ్చి పెనుదుమారం రేపుతోంది. అందరూ నోరు వెళ్లబెట్టి చూస్తుండగానే ఈ అరాచకం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2021 / 07:17 PM IST
    Follow us on

    జర్నలిస్ట్ రఘు అరెస్ట్ వీడియో బయటకు వచ్చింది. అసలు ఆ వీడియో చూస్తే మనం తెలంగాణలో ఉన్నామా? లేదా ప్రజాస్వామ్యం లేని ఉత్తరకొరియాలో ఉన్నామా? అన్న సందేహం కలుగకమానదు. ఎందుకంటే పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. దొంగలు దోపిడీదారుల్లో ఇద్దరు కండ కలిగిన వారు వచ్చి అందరూ చూస్తుండగానే.. మామిడి పండ్లు కొంటున్న జర్నలిస్టును నడిబజారులో అలా కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లడం తీవ్రసంచలనమైంది. ఆ వీడియో బయటకు వచ్చి పెనుదుమారం రేపుతోంది. అందరూ నోరు వెళ్లబెట్టి చూస్తుండగానే ఈ అరాచకం రాజ్యమేలింది.

    ప్రజాస్వామ్య వ్యవస్థలో అరెస్ట్ ఇలానే చేస్తారా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా ఆటవిక నియంత పాలన సాగుతున్న విషయం అర్థమవుతుందని జర్నలిస్టులు మండిపడుతున్నారు. గూండాలు కిడ్నాప్ చేసినట్టుగా అలా నడి రోడ్డు మీద ఎత్తుకెళ్లడం చూస్తే తెలంగాణలో పాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ జర్నలిస్ట్ రఘు చేసిన తప్పు ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వ అన్యాయాలపై ప్రశ్నించడమే..

    టీవీ జ‌ర్న‌లిస్టు, యాంక‌ర్ ర‌ఘు అరెస్టు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. మొద‌ట ఆయ‌న్ను కిడ్నాప్ చేసిన‌ట్టు వార్త‌లు రాగా.. ఆ త‌ర్వాత ఆయ‌న్ను పోలీసులు తీసుకెళ్లార‌ని తేలింది. దీంతో.. ర‌ఘును పోలీసులు ఎందుకు తీసుకెళ్లార‌నే చ‌ర్చ హాట్ టాపిక్ గా మారింది. అంద‌రూ కార‌ణాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. చాలా మంది మాత్రం ఒకే కార‌ణం చూపెడుతున్నారు.

    ర‌ఘు ప‌లు టీవీ ఛాన‌ళ్ల‌లో ప‌నిచేశారు. ప్ర‌స్తుతం తొలివెలుగు యూట్యూబ్ చాన‌ల్ లో ప‌లు క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటున్నాయి. అదే స‌మ‌యంలో టీఆర్ఎస్ వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించే ఉద్య‌మ‌కారుల‌ను, ఇత‌రుల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తున్నారు.

    అంతేకాకుండా.. కోకాపేట కాందీశీకుల భూములు, ఐడీపీఎల్ భూముల రిజిస్ట్రేష‌న్లు త‌దిత‌ర అంశాలు ప్ర‌సారం అయ్యాయి. అదేవిధంగా గ‌తంలో సూర్య‌పేట జిల్లా గుర్రంపోడు అసైన్డ్ భూముల వ్య‌వ‌హారంపై ప్ర‌సారం చేసిన క‌థ‌నాలు సంచ‌ల‌నం అయ్యాయి. ఆ అంశం రాజ‌కీయంగా కూడా వేడి పుట్టించింది. ఈ క్రమంలోనే నెలకొన్న ఘర్షణ విషయంలో ర‌ఘుపై కేసులు కూడా న‌మోదైన‌ట్టు స‌మాచారం.

    గుర్రంపోడు తండా 540 స‌ర్వే నెంబ‌ర్ విష‌యంలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ర‌ఘు నిందితుడిగా ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులోనే ర‌ఘును అరెస్టు చేసిన‌ట్టు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇచ్చామని తెలిపారు. అతన్ని హుజూర్ నగర్ సివిల్ జడ్జి ముందు హాజ‌రుప‌ర‌చ‌గా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో.. హుజూర్ నగర్ సబ్ జైలుకు తరలించారు.

    అయితే ఒక జర్నలిస్ట్ పట్ల.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తి పట్ల ఇలా గొంతు నొక్కేసేలా పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నిస్తే ఇంత దారుణంగా కిడ్నాప్ చేసి అరెస్ట్ చేస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది గొంతునొక్కడమే అంటున్నారు.