హీరోయిన్ శృతీహాసన్ తన ఫాలోవర్స్ తో పలు విషయాలను పంచుకోవడానికి ఈ రోజు ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చింది. అయితే ఓ నెటిజన్ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ ఆమెకు ప్రపోజల్ పెట్టాడు. దానికి శ్రుతీహాసన్ సింపుల్ గా ‘చేసుకొను’ అంటూ అతన్ని తిరస్కరించింది. ఇక మరో నెటిజన్ ‘మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి’ అంటూ అడగడం, ‘అబ్బో.. నా నెంబర్ కావాలా ?’ నో’ అని నవ్వుతూ అతన్ని కట్ చేసింది శ్రుతీ.
‘మీరు నటించిన ఓ మై ఫ్రెండ్ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. ఆ సినిమా మీకు గుర్తుందా అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.. ‘ఆ సినిమా నాకు కూడా బాగా ఇష్టమైన సినిమా’ అంటూ మురిసిపోతూ చెప్పింది. ‘ఇక వైజాగ్ కు ఎఫ్పుడు వస్తున్నారు’ అని మరొకరు అడిగితే.. ‘మీకు తెలియదు, నాకు చిన్నప్పటి నుంచి వైజాగ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం వైజాగ్ కి వస్తూనే ఉంటాను’ అంటూ ఈ ముదురు భామ సెలవిచ్చింది.
ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’లో మీ రోల్ ఎలా ఉండబోతుంది ? అని అడిగితే, సలార్ మూవీలో నాది సూపర్ పాత్ర. అయితే, ఆ సినిమా గురించి, అలాగే ఆ సినిమాలో నా పాత్ర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేను’ అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈ లైవ్ లో హైలైట్ గా నిలిచిన పాయింట్ మాత్రం శ్రుతీ హాసన్ కి వచ్చిన పెళ్లి ప్రపోజలే. అయినా సోషల్ మీడియా ఫాలోవర్ని పెళ్లి చేసుకోవడానికి శ్రుతి హాసన్ ఏమైనా అమాయకురాలా ?
పైగా ప్రస్తుతం శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తోనే కలిసి ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ‘శాంతను హజారికా’తో కలిసి రకరకాల ఫోజులిస్తూ ఫోటోలు తీసుకుని, ఆ ఫోటోలను అన్నిటిని రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది కూడా. ఏది ఏమైనా శృతి హాసన్ కి బాయ్ ఫ్రెండ్స్ విషయంలో అసలు మొహమాటం ఉండదు. అంతా ఓపెన్ గానే చెప్పేస్తోంది.