https://oktelugu.com/

Arnab Goswami: చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ ఎమ్మెల్యేను చెడుగుడు ఆడిన అర్నాబ్

స్కిల్ స్కామ్ కేసునకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ లో ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి డిబేట్ పెట్టారు. దీనికి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : September 13, 2023 4:26 pm
    Arnab Goswami

    Arnab Goswami

    Follow us on

    Arnab Goswami: చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ కక్షపూరితంగానే అరెస్టు జరిగిందని చెబుతున్నాయి. కేసు నమోదు తో పాటు సెక్షన్ల విధింపు సైతం అస్తవ్యస్తంగా ఉందని.. కనీస నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ వస్తున్నా ప్రత్యర్థుల ముందు పలుచున అవుతోంది అని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఓ జాతీయ మీడియాలో జరిగిన చర్చలో అధికార వైసీపీ ఎమ్మెల్యే ఒకరు సమాధానాలు చెప్పలేక నీళ్లు నమలడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    స్కిల్ స్కామ్ కేసునకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ లో ప్రముఖ జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి డిబేట్ పెట్టారు. దీనికి నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. టిడిపి నుంచి కొమ్మిరెడ్డి పట్టాభి హాజరయ్యారు. అయితే ఆర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి సరైన సమాధానం చెప్పలేదు. దీనిపై గోస్వామి కాస్త కటువుగానే మాట్లాడారు. ప్రిపేర్ కాకుండా డిబేట్ కి రావడం ఏమిటని ప్రశ్నించారు. అసహనం వ్యక్తం చేశారు.

    స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సి మెన్స్ సంస్థ లంచం ఇచ్చినట్లు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అని గోస్వామి ప్రశ్నించారు. దీనికి రవిచంద్ర కిషోర్ రెడ్డి నుంచి సమాధానం కరువైంది. కొద్దిసేపు ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది. అదే సిఐడి చూస్తోంది. దాన్నే నిరూపించాలనుకుంటోంది. దానికోసమే విచారణ సాగుతోంది. చంద్రబాబు సహకరించడం లేదని.. ఇలా ఎమ్మెల్యే పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో గోస్వామి అసలు ప్రిపేర్ అయి వచ్చారా లేదా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

    స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి చంద్రబాబు అవినీతి చేశారని ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆరోపించారు. ఈ స్కాం చంద్రబాబు హయాంలోనే జరిగిందని.. దాన్ని క్యాబినెట్ అజెండాలో లేకుండా చివరి నిమిషంలో పెట్టి ఆమోదించారని.. అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. దానిపై అర్నాబ్ గోస్వామి స్పందించారు. హడావుడి నిర్ణయం అంటే మీ వైసీపీ సభ్యులకు ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్న మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నిర్ణయం తీసుకున్నట్టా? అని ప్రశ్నించారు. అయితే దాని గురించి తనకు తెలియదని ఎమ్మెల్యే రవి కిషోర్ రెడ్డి దాటవేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది.