https://oktelugu.com/

Kushi: తెలుగులో ఫ్లాప్ ..తమిళంలో సూపర్ హిట్.. ఖుషి సినిమాపై భిన్నాభిప్రాయాలు.

మరోపక్క ఈ సినిమా పాన్ ఇండియా అన్నారు.. హిందీలోనూ విడుదల చేస్తామన్నారు. కానీ ఆ ఊసే లేకుండా పోయింది. ఇక కేరళలో విజయ్ ఫాలోయింగ్‌తో ఖుషి పర్వాలేదనిపించింది. కన్నడలో అసలు టాకే వినిపించలేదు. కానీ అన్నిటికన్నా భిన్నంగా తమిళ వారిని మాత్రం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 13, 2023 / 04:20 PM IST

    Kushi

    Follow us on

    Kushi: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా చేసిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా అలానే సాగాయి. యూఎస్, నైజాం, తమిళంలో మంచి కలెక్షన్ సాధించగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నష్టాల వైపు పరుగులు తీసింది.

    మరోపక్క ఈ సినిమా పాన్ ఇండియా అన్నారు.. హిందీలోనూ విడుదల చేస్తామన్నారు. కానీ ఆ ఊసే లేకుండా పోయింది. ఇక కేరళలో విజయ్ ఫాలోయింగ్‌తో ఖుషి పర్వాలేదనిపించింది. కన్నడలో అసలు టాకే వినిపించలేదు. కానీ అన్నిటికన్నా భిన్నంగా తమిళ వారిని మాత్రం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.

    మన తెలుగు హీరోల సినిమాలు అక్కడ అంతగా ఆడవు. అయితే ఈ విజయ్ దేవరకొండ సినిమా మాత్రం ఏకంగా మాత్రం పది కోట్ల గ్రాస్‌ను రాబట్టి షాక్‌కు గురి చేస్తోంది.

    తమిళంలో కన్నా తెలుగులో ఈ సినిమాకి ఎక్కువ ప్రమోషన్స్ చేశారు విజయ్ దేవరకొండ. అంతేకాకుండా దాదాపు తమిళ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కూడా ఒకే విధంగా ఉంటుంది. కానీ విచిత్రంగా తమిళంలో ఈ సినిమా దూసుకుపోగా, కొన్ని తెలుగు ప్రదేశాలలో మాత్రం ఖుషి ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ మూవీకి ఇంకా పది, పదమూడు కోట్లు రావాల్సి ఉంది. అప్పుడే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ హిట్టుగా నిలుస్తుంది.

    ఇక ఈ బ్రేక్ ఈవెన్ స్టేటస్ చూస్తే ఈ సినిమా తప్పకుండా తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకోదు అని అర్థం అయిపోయింది. 53 కోట్ల టార్గెట్‌తో దిగిన ఖుషి ఇప్పటి వరకు నలభై కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. ఇక రావాల్సిన 13 కోట్లు.. ఏపీలోనే రావాల్సి ఉంది.

    మొత్తానికి శివనిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ సొంతం చేసుకొని తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ రాబట్ట లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.