https://oktelugu.com/

బూతులు తిట్టేందుకే నానిని మంత్రిగా పెట్టుకున్నారా ?

బూతులు తిట్టేందుకే కొడాలి నానిని మంత్రిగా పెట్టుకున్నారా అనే విషయంపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ, బాధ్యతలు మరచి సంస్కార హీనులుగా అసహనంతో పశువులు కూడా మాట్లాడని బాష ముఖ్యమంత్రి జగన్ కేబినేట్ లోని మంత్రులు మాట్లాడుతున్నారని, మంత్రి కొడాలి నానిని వెంటనే కేబినేట్ నుండి బర్తరఫ్ చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు. రైతు వద్ద బస్తా ధాన్యం […]

Written By: , Updated On : March 31, 2020 / 08:10 PM IST
Follow us on

బూతులు తిట్టేందుకే కొడాలి నానిని మంత్రిగా పెట్టుకున్నారా అనే విషయంపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గొల్లపూడిలోని కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మాట్లాడుతూ, బాధ్యతలు మరచి సంస్కార హీనులుగా అసహనంతో పశువులు కూడా మాట్లాడని బాష ముఖ్యమంత్రి జగన్ కేబినేట్ లోని మంత్రులు మాట్లాడుతున్నారని, మంత్రి కొడాలి నానిని వెంటనే కేబినేట్ నుండి బర్తరఫ్ చేయాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు. రైతు వద్ద బస్తా ధాన్యం రూ.900లకే దళారీలు దోపిడి చేస్తుంటే, సీఎం జగన్ మంత్రి కొడాలి నాని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదో ప్రజలకు సమాధానం చెప్పకపోతే పంటలు పండించిన రైతులే తగిన బుద్ధి చెప్తారన్నారు. సంచులు లేక బియ్యాన్ని పంపిణీ చేయలేకపోతున్నామని మంత్రులు చెప్పటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కొడాలి నాని.. చంద్రబాబు వద్ద చేతులు కట్టుకుని, కంచికచర్ల నా కార్యాలయంలో ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నావో మర్చిపోయావా ? అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పక్క రాష్ట్రాల్లో రెండు నెలలకు సరిపోయే విధంగా నిత్యవసరాలు అందజేస్తుంటే, ఏపీలో గంటల కొద్దీ మహిళలను, వృద్ధులను క్యూలైన్లలో నిలబెడుతున్నారని, ఆ దృశ్యాలను ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా చూపించటం తప్పెలా అవుతుదన్నారు. వాస్తవాలను చూపెడుతున్న మీడియా కోరలు పీకుతామనటం ఎంత వరకు సమంజసమన్నారు. మెట్ట ప్రాంతాల్లో మల్లె రైతులు నష్టపోతున్నారని, వారిని ఏ విధంగా ఆదుకుంటారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వేలకోట్లు వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తూ, ఈ రోజు ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఎందుకు వైఫల్యం చెందుతున్నామోనని, వాలంటీర్ల వ్యవస్థ పనితీరు పట్ల ప్రజల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నరాని తెలిపారు. విజయసాయి రెడ్డి చాలా బాధ్యతరాహిత్యంగా ట్వీట్లు పెడుతుంటే, సీఎం జగన్ తాడేపల్లి రాజప్రసాదం పబ్జీ గేమ్ లు ఆడుకుంటూ పరిపాలన పట్ల బాధ్యత రహితంగా వ్యవహిరిస్తున్నారని, ఢిల్లీకి ఏ జిల్లా నుండి ఎంత మంది వెళ్లారో ఇప్పటి వరకు ప్రభుత్వం వివరాలు చెప్పలేకపోయిందని దేవినేని ఉమా ఆవేదిక వ్యక్తం చేసారు.