
అమెరికా మాజీ అధ్యక్షుడు.. వివాదాస్పద డొనాల్డ్ ట్రంప్ నకు ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు గట్టి షాక్ ఇచ్చారు. తమ దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలు చెప్పబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బైడెన్ ఈ విషయాలను వెల్లడించారు. దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దేశ రహస్య విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కీలక సమాచారం చెప్పడం వల్ల ఏం లాభం అని .. అసలే ట్రంపు నోరుకు కాస్త దురద ఎక్కువ అని ఏదో వాగడం తప్పా.. అతడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా…? అని బైడెన్ వ్యాఖ్యానించారు.
Also Read: మయన్మార్ లో ఫేస్ బుక్ అక్కడి సైనిక ప్రభుత్వానికి ఎందుకు భయపెడుతోంది?
అయితే దేశ మాజీ అధ్యక్షులకు అమెరికా దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం అందజేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇదీ వారికిచ్చే గౌరవంగా భావిస్తుంటారు. అలాగే వారి అనుభవం భవిష్యత్తులో వినియోగించుకోవచ్చనే ఆలోచనతోఅలా చేస్తుంటారు. అయితే ఇది కేవలం అధికారంలో ఉన్న అధ్యక్షులకు సమ్మతం అయితేనే జరుగుతుంది. కానీ ట్రంప్ నకు తెలియజేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదని పైగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని బైడెన్ అంటున్నారు.
Also Read: వలస విధానాలపై అమెరికా తాజా ఉత్తర్వులు : ట్రంప్ విధానాలకు బైబై
గతంలో ట్రంప్ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారుల సైతం బైడెన్ కు ఇదే సూచనలు ఇస్తున్నారు. మాజీ అధ్యక్షులను ప్రత్యర్థి దేశాలు.. లక్ష్యంగా చేసుకుని.. కీలక సమచారాన్ని రాబట్టే.. ప్రమాదం ఉందని.. ట్రంప్ హయాంలో జాతీయ భద్రతా విభాగానికి ప్రిన్సిపల్ డిప్యూటీ డైరెక్టర్ గా వ్యవహరించిన గోర్డన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వెల్లడించారు. అదే విధంగా అమెరికా ప్రత్యర్థి దేశాల్లోనూ ట్రంపుకు వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. వాటి నుంచి లబ్ధి పొందేందుకు ఆయన సమాచారాన్ని లీక్ చేయొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
మొత్తం అమెరికా అధ్యక్షుడి పదవి నుంచి ట్రంప్ గద్దె దిగిన తవారుత.. అతడి నీడను కూడా ఎవరూ నమ్మడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆనాటి నుంచి వస్తున్న ఆచారాన్ని ట్రంప్ వద్దకు వచ్చేసరికి నిలిపివేశారనడానికి ఇదే నిదర్శనం. అధికారం నుంచి కూడా బలవంతంగా దిగిపోయిన ట్రంప్ భవిష్యత్ లో దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లోనూ.. తలదూర్చి.. అల్లర్లు.. శాంతిభద్రతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ప్రస్తుత అధ్యక్షడు బైడెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.