Afghanistan: జాతినుద్దేశించి అమెరికా అధ్యక్షుడు.. అప్ఘన్ పై సంచలన ప్రకటన

Afghanistan: అమెరికా (America)తన బలగాలను అఫ్గనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంపై అధ్యక్షుడు బైడెన్ (President Joe Biden) ప్రసంగించారు. అఫ్గాన్ సంక్షోభ (Afghanistan Crisis) పరిస్థితుల నేపథ్యంలోనే దేశం నుంచి విడిచిపోవాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అఫ్గాన్ లో పరిపాలన చేసినా ఇక ప్రస్తుతం సాధ్యం కాలేదని తెలుస్తోంది. అందుకే దేశం విడిచి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా నిరసనలు చెలరేగినా చేయక తప్పలేదు. అమెరికా సేనలు దేశం విడిచి […]

Written By: Srinivas, Updated On : September 1, 2021 10:14 am
Follow us on

Afghanistan: అమెరికా (America)తన బలగాలను అఫ్గనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంపై అధ్యక్షుడు బైడెన్ (President Joe Biden) ప్రసంగించారు. అఫ్గాన్ సంక్షోభ (Afghanistan Crisis) పరిస్థితుల నేపథ్యంలోనే దేశం నుంచి విడిచిపోవాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అఫ్గాన్ లో పరిపాలన చేసినా ఇక ప్రస్తుతం సాధ్యం కాలేదని తెలుస్తోంది. అందుకే దేశం విడిచి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. దీనిపై ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా నిరసనలు చెలరేగినా చేయక తప్పలేదు. అమెరికా సేనలు దేశం విడిచి వెళ్లిపోవడంతో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. అరాచక పాలన సాగిస్తున్నారు. అడ్డం వచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అమెరికా సేనలు వెనక్కి తగ్గడంతో తాలిబన్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు.

అఫ్గానిస్తాన్ సంక్షోభానికి అమెరికాయే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్ తన బలగాలను వెనక్కి పిలిపించుకోవడంతోనే నిరసనలు నింగినంటుతున్నాయి. అఫ్గాన్ పరిస్థితిపై బ్రిటన్ సైతం విమర్శలు చేసింది. ఆగస్టు 31 నాటికి తన బలగాలను వెనక్కి పిలిపిస్తామని చెప్పినా అంతకన్నా ముందే తన మాట నిలబెట్టుకుంది. 17 రోజుల్లోనే బలగాల తరలింపు ప్రక్రియ పూర్తి చేసి తానేమిటో నిరూపించుకుంది.

అమెరికా సైనిక బలగాల ఉపసంహరణను సమర్థించుకుంది. మరో ప్రత్యామ్నాయంలేకనే సైన్యాన్ని వెనక్కి పిలిపించినట్లు పేర్కొంది. ఇది అత్యుత్తమ నిర్ణయంగా వెల్లడించింది. అఫ్గాన్ లో తమ సైన్యం మోహరించడం వల్ల రోజుకు 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఇంత ఖర్చును ఇన్ని సంవత్సరాల పాటు భరించినందుకు ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని చెప్పింది. దాదాపు 1.20 లక్షల అమెరికా పౌరులు, అఫ్గనిస్తానీయులు, ఇతర దేశాల వారిని తరలించారు. దీంతో అమెరికాకు విపరీతంగా ఖర్చయిందని చెబుతున్నారు.

యుద్ధం నిరంతరం కొనసాగదని ఎక్కడో ఒక చోట ముగింపు ఉంటుంది. అందుకే అఫ్గన్ నుంచి తన బలగాలను వెనక్కి రప్పించినట్లు బైడెన్ చెప్పారు. తాలిబన్ల ఆక్రమణ మొదలైన తరువాత అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోవడంతో పెద్ద తప్పు చేశారు. దీంతోనే దేశంలో అల్లర్లు చెలరేగాయని తలుస్తోంది. అరాచకత్వం కూడా నిలువెత్తు లేచిందని సమాచారం. తాలిబన్ల బలం క్రమంగా పెరగడంతో వారి అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే దేశం మొత్తం తాలిబన్ల కబంధ హస్తాల్లోకి వెళ్లింది.

అఫ్గాన్ పరిణామాలతో అమెరికా కూడా నష్టపోయింది. 20 సంవత్సరాల పాటు పరాయి దేశంలో ఉండి సేవలందించడం మామూలు విషయం కాదు. దేశంలో సైనిక బలగాల సేవలకు మిలియన్ల కొద్దీ ఖర్చు చేసి తీవ్ర నష్టాలను మిగిల్చుకుంది. దీంతోనే అమెరికా తన బలగాలను వెనక్కి పిలిపించుకుని చేసిన తప్పును సరిదిద్దుకుంది. దీంతో అఫ్గాన్ శకం ముగిసట్లే అని బైడెన్ ఉద్విగ్న భరితంగా మాట్లాడారు.