Dethadi Harika: అప్పట్లో సినిమాల్లో కనిపిస్తేనే సెలబ్రిటీ అనుకునే వాళ్లం. సినిమాల్లో నటించే వారిని మాత్రమే నటులుగా భావించేవాళ్లం. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఒక్క సారిగా అంతా మార్చేసింది. ట్యాలెంట్ ఉన్న వారికి ఇది ఓ పెద్ద వేదిక అయిపోయింది. సినీ సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా ఫేమస్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. అలా ఫేమస్ అయి బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టింది దేత్తడి హారిక.

మామూలుగా హారిక అంటూ ఎవరూ గుర్తు పట్టరేమో గానీ.. దేత్తడి హారిక అంటే మాత్రం ఈజీగానే గుర్తు పట్టేస్తారు. తెలంగాణ యాసలో ఈమె చెప్పే డైలాగులు అంత ఫేమస్ మరి. యూ ట్యూబ్‌లో ఈమె చేసే వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేవి. దాంతో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ క్రేజ్‌తోనే బిగ్ బాస్‌లో అడుగు పెట్టింది.
Also Read: మహిళలకు కేంద్రం శుభవార్త.. రెండో కాన్పుకు కూడా డబ్బులు పొందే ఛాన్స్!
అయితే హారిక గురించి చాలామందికి తెలియదు. ఆమె అసలు పేరు అలేఖ్య హారిక. కానీ దేత్తడి హారికగా ఫేమస్ అయింది. కాగా ఈమె చదువు అయిపోగానే మొదట జాబ్ కూడా చేసింది. అది కూడా చాలా పెద్ద సంస్థ అయిన అమేజాన్ లో. ఆ సంస్థలో చాలా పెద్ద పొజిషన్ ఆమెది. అయినా సరే నటన మీద ఉన్న ఆసక్తితో ఆ జాబ్‌ను వదిలేసింది.

ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఇక ఈ క్రమంలోనే కొన్ని ఫేమస్ సాంగ్స్‌కు కవర్ సాంగ్స్ చేసింది. కానీ వాటితో ఆమెకు పెదద్ క్రేజ్ రాలేదు. ఎప్పుడైతే దేత్తడి హారిక పేరు మీద సిరీస్ చేసిందో అప్పుడే ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆమె నటనకు తోడు గ్లామర్ షో టచ్ కావడంతో అనతి కాలంలోనే దేత్తడి హారికగా యూట్యూబ్ లో దుమ్మే లేపింది. ఇక ఆమె ఇప్పుడు కొన్ని సిరీస్‌లలో నటిస్తోంది.
Also Read: మెగాస్టార్’ పై మంచు విష్ణు సంచలన కామెంట్స్ !