జూ.ఎన్టీఆర్: టీడీపీ శ్రేణుల డిమాండ్ కరెక్టేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు బలహీనమైపోయాడు. లోకేష్ బాబు శక్తి సామర్థ్యాలు అంతగా సరిపోవడం లేదు. దీంతో టీడీపీ నాయకత్వం పట్ల కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. అందుకే టీడీపీని బతికించడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని తెలుగు తమ్ముళ్లు ఆయన ఫొటోలు, ప్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు.‘నెక్ట్స్ సీఎం’ అనే శీర్షికతో హోరెత్తిస్తున్నారు. అయితే జూనియర్ పార్టీని ఎంతవరకు రక్షించగలడన్నది ప్రశ్న. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ శక్తి ఎంతో తేటతెల్లమైంది. 12 సంవత్సరాల క్రితం వైఫల్యం మన కళ్లముందే ఉంది. 2009 ఎన్నికల్లో […]

Written By: NARESH, Updated On : July 17, 2021 2:43 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు బలహీనమైపోయాడు. లోకేష్ బాబు శక్తి సామర్థ్యాలు అంతగా సరిపోవడం లేదు. దీంతో టీడీపీ నాయకత్వం పట్ల కార్యకర్తల్లో నిరాశ వ్యక్తమవుతోంది. అందుకే టీడీపీని బతికించడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలని తెలుగు తమ్ముళ్లు ఆయన ఫొటోలు, ప్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు.‘నెక్ట్స్ సీఎం’ అనే శీర్షికతో హోరెత్తిస్తున్నారు. అయితే జూనియర్ పార్టీని ఎంతవరకు రక్షించగలడన్నది ప్రశ్న.

అయితే ఇప్పటికే ఎన్టీఆర్ శక్తి ఎంతో తేటతెల్లమైంది. 12 సంవత్సరాల క్రితం వైఫల్యం మన కళ్లముందే ఉంది. 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ ను విమర్శించి.. చంద్రబాబును ప్రశంసిస్తూ జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆయన తన ప్రసంగాల్లో ఎన్టీఆర్ ను అనుకరిస్తూ టీడీపీలో ఉత్సాహం నింపారు. అయితే జనాలు మాత్రం టీడీపీని ఆదరించలేదు. జూ.ఎన్టీఆర్ ప్రచారం చేసిన ప్రదేశాల్లో వైసీపీ ఘోరంగా విఫలమైంది.

2009లో టీడీపీ ఘోర పరాజయం పాలై.. రాష్ట్రంలో వైఎస్ఆర్ నాయకత్వంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం పార్టీకి పనికి రాదని తేలింది.

ప్రజలు సినీ స్టార్లకు ఓటు వేసే రోజులు పోయాయని ఇప్పటికే తేటతెల్లమైపోయింది. చిరంజీవి, కమల్ హాసన్, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ లు ఇలానే రాజకీయాల్లోకి వచ్చి విఫలమయ్యారు. కొందరు వైదొలిగారు కూడా. ఇంకా ప్రభావం ఉందని నమ్మి రావడానికి స్టార్లు సైతం సాహసించడం లేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తన ముద్రను టీడీపీలో వేస్తారని నమ్మడానికి వీల్లేదు.

ప్రజలు, పార్టీ కార్యకర్తలు తనను నిజంగా ఆహ్వానిస్తున్నారనే నిర్ధారణకు వెళ్లకూడదు. రాజకీయాలకు సమయం వృథా చేయడం ద్వారా ఆయన సినీ జీవితాన్ని పాడుచేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.