https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు ఇప్పటివరకు 1,184 ఉద్యోగ ఖాళీలను గుర్తించామని ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉద్యోగ ఖాళీలను పెంచి గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఆయన అన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు వయోపరిమితిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 17, 2021 / 09:20 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీపీఎస్సీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు ఇప్పటివరకు 1,184 ఉద్యోగ ఖాళీలను గుర్తించామని ఈ ఉద్యోగ ఖాళీలలో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఉద్యోగ ఖాళీలను పెంచి గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ఆయన అన్నారు.

    పరీక్షలు రాసే అభ్యర్థులు వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్న నేపథ్యంలో వినతులను ప్రభుత్వానికి పంపుతున్నామని షేక్ సలాంబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే వయో పరిమితి విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని గ్రూప్ 1 మినహా మినహా మిగిలిన ఉద్యోగ ఖాళీలకు ఇకపై ప్రిలిమ్స్ ఉండవని షేక్ సలాంబాబు స్పష్టం చేశారు.

    ఒకే పరీక్షను నిర్వహించడం ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. త్వరగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను పూర్తి చేయాలంటే ఏడాదికి పైగా సమయం పడుతోందని షేక్ సలాంబాబు అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తూ ఇకపై వచ్చే పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.

    ఏడాదిన్నర సమయంలో ఏకంగా 32 నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తి చేశామనీ షేక్ సలాంబాబు అన్నారు. గ్రూప్ 1 నియామకాలను, పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులను ఆ ఉద్యోగ ఖాళీలు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో పూర్తి చేయలేకపోయామని షేక్ సలీంబాబు వెల్లడించారు. ఆగష్టులో 1180కు పైగా ఉద్యోగ ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ కానుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.