Jharkhand : జార్ఖండ్‌లోని లుగు పర్వత ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత రూ.కోటి రివార్డు ఉన్న ప్రయాగ్ మాంజి అలియాస్ వివేక్ హతమయ్యాడు. అతడితోపాటు మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్, జార్ఖండ్ పోలీసులు పాల్గొన్నారు. ప్రయాగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ రూ. కోటి రివార్డ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. క్రై స్తవ సమాజంలో విషాదం
లుగు హిల్స్‌లో ఆపరేషన్
సోమవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో లుగు హిల్స్ వద్ద మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రయాగ్ మాంజితోపాటు అరవింద్, రామ్ మాంజి వంటి నేతలు ఈ ఘటనలో హతమయ్యారు. వీరిపై రూ. 10 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. సీఆర్‌పీఎఫ్ 209 కోహ్లీ బెటాలియన్, ఝార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడటంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ వంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కార్యకలాపాల కేంద్రం..
ప్రయాగ్ మాంజి, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, ప్రశాంత్ హిల్స్‌ను తన కార్యకలాపాల కేంద్రంగా చేసుకున్నాడు. ఝార్ఖండ్‌లోని ధనాబాద్ జిల్లా తుండీ పరిధిలోని దల్బుద అతడి స్వగ్రామం. ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు 100 దాడుల్లో అతడి ప్రమేయం ఉంది. ఒక్క గిరిడీ జిల్లాలోనే 50 కేసులతో రూ. కోటి రివార్డ్ ఉంది. ఝార్ఖండ్‌లో అత్యధిక రివార్డ్‌తో రెండో స్థానంలో ఉన్న మావోయిస్టుగా అతడు గుర్తింపు పొందాడు.
జార్ఖండ్ పోలీసుల విజయం
2025లో జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటివరకు 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 244 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు, 24 మంది కమాండర్లతో సహా లొంగిపోయారు. 2025 చివరి నాటికి ఝార్ఖండ్‌ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో పోలీసులు కషి చేస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఆ దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుంది.
ప్రయాగ్ మాంజి భార్య గతం
ప్రయాగ్ మాంజి భార్య జయాను గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స కోసం వచ్చిన సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తర్వాత చికిత్స సమయంలో మృతి చెందింది.
లుగు హిల్స్ ఎన్‌కౌంటర్ జార్ఖండ్‌లో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బ తీసింది. ప్రయాగ్ మాంఝి వంటి కీలక నేత హతం కావడం భద్రతా బలగాల విజయాన్ని సూచిస్తుంది. రాష్ట్రాన్ని హింసారహితంగా మార్చేందుకు పోలీసులు, సీఆర్‌పీఎఫ్ చేస్తున్న కషి ఫలితాలను ఇస్తోంది. ఈ ఆపరేషన్ మావోయిస్టు ఉద్యమంపై ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read : ఒక్క రాంగ్ కాల్.. ఆమె జీవితాన్ని కష్టాల్లో నెట్టింది!