JD Laxminarayana: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. పార్టీలు తమ వ్యూహాలు మారుస్తున్నాయి. అధికారం కోసం వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా తమ ప్రభావం చూపించి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి. గతంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ జనసేనలో చేరి పోటీ చేసి ఓటమి పాలవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వచ్చంధంగా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. తనదైన శైలిలో సమస్యలపై స్పందిస్తున్నారు. ఇప్పటికైతే ఏ పార్టీలో చేరకపోయినా ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
ఆయన ఏ పార్టీలో చేరతారనే ఆసక్తి అందరిలో నెలకొంది. గతంలో జనసేనలో చేరినా ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరతారని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఆయన మాత్రం జనసేనను ఇటీవల కాలంలో ప్రశంసిస్తున్నారు. పవన్ కల్యాణ్ చేసే పనులు బాగున్నాయని చెబుతున్నారు. దీంతో ఆయన జనసేనలోకే వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆయన వైసీపీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి కూడా ఆయనను వైసీపీలోకి రావాలని ఆకాంక్షించారు. కానీ అది కుదరలేదు.
Also Read: AP Cabinet Expansion: క్యాబినెట్ నుంచి అవుట్?.. మంత్రి అవంతికి ఇక్కట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో లక్ష్మినారాయణ చురుకుగా పాల్గొంటున్నారు. కార్మికుల పక్షాన నిలిచి వారికి అండదండగా ఉంటున్నారు. దీంతో స్థానిక సమస్యలపై పోరాడుతున్నారు. ఆయన ఏ పార్టీలో చేరినా ఎంతో కొంత ప్లస్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియడం లేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు మాత్రం ఏదో ఒక పార్టీలో చేరతారనే విషయం తెలుస్తోంది.
ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో లక్ష్మినారాయణ ఏ పార్టీలో చేరినా దాని ప్రతిష్ట పెరుగుతుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన జనసేనలో చేరతారనే వాదన కూడా వస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ బలం పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన రాక కోసం అన్ని పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఆయన మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అన్ని పార్టీలు ఆయనను తమ పార్టీలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం.
Also Read:AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. స్వరూపాలు.. అతిచిన్న జిల్లాకు ‘పర్యాటకం’ దూరం