Minister Kodali Nani: చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడతారు మంత్రి కొడాలి నాని. ఒంటిపై లేచి భూతు పురాణం అందుకుంటారు. చాలా చులకనగా మాట్టాడతారు. అసలు వారు మనుషులే కాదు అన్నట్టు తిట్ల దండకం చదువుతుంటారు. సగటు చంద్రబాబు, టీడీపీ అభిమానులు నాని వ్యాఖ్యలను నొచ్చుకుంటారు. కానీ టైమ్ బాగాలేన్నప్పుడు ఏం చేస్తాములే అన్నట్టు ఆ తండ్రీ కొడుకులు సైలెంట్ అవుతున్నారు. అయితే కొడాలి నానిపై మాత్రం అంతర్గతంగా భారీ స్కెచ్ వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు.
గుడివాడ నందమూరి కుటుంబం సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పరిధిలోనే ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉంది. ఇక ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఫస్ట్ టైమ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది గుడివాడలోనే. అలాంటి సీటుని నందమూరి ఫ్యామిలీ తరువాత కాలంలో వదిలేసుకుంది. ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు సైతం అక్కడ నందమూరి కుటుంబీకులు పట్టు సాధించుకునేలా ప్రయత్నం చేయలేదు. ఎన్టీఆర్ ఈ నియోజకవర్గాన్ని వదిలేసిన తరువాత తొలుత రావి ఫ్యామిలి, ఇప్పుడు కొడాలి నాని కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నారు. కొడాలి నాని అయితే 2004 నుంచి ఈ రోజు వరకూ నాలుగు సార్లు గెలిచి తన పట్టును నిలుపుకుంటూ వస్తున్నారు. అందులో రెండుసార్లు వైసీపీ తరుపున గెలుపొందారు.ఒక విధంగా కొడాలి గుడివాడ నాది అంటున్నారు.
Also Read: AP Cabinet Expansion: క్యాబినెట్ నుంచి అవుట్?.. మంత్రి అవంతికి ఇక్కట్లు
ఆయనకు ఆ సీటు చాలా అనుకూలంగా ఉంది. పార్టీలు మారినా జనాలు గెలిపిస్తున్నారు అంటే అది కొడాలి గొప్పతనమే అనుకోవాలి. ఆయనకు కమ్మ వారితో పాటు ఇతర సామాజిక వర్గాల దన్ను కూడా ఉంది. ఇక ఎన్టీయార్ తరువాత ఆ ఫ్యామిలీ నుంచి నందమూరి హరిక్రిష్ణ 1999 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన అన్న తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 11 వేల ఓట్లు మాత్రమే దక్కాయి. ఇక హరికి గుడివాడకూ చాలా అనుబంధం ఉంది. ఆయన బాల్యం అంతా నిమ్మకూరులోనే గడచింది. అలాంటి హరిక్రిష్ణను కూడా గుడివాడ జనాలు గెలిపించలేదు.
టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చలు
అయితే ఈసారి నందమూరి కుటుంబం నుంచి ఒకరు గుడివాడ నుంచి బరిలో దిగుతారన్న వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొడాలి నాని లోకేష్ మీద కామెంట్స్ చేస్తూ దమ్ముంటే గుడివాడలో నా పైన పోటీ చేసి గెలువు అనేశారు. దీంతో టీడీపీలో ఇది చర్చకు దారితీసింది. ఎలాగైనా నానిని ఎన్టీఆర్ కుటుంబసభ్యులే ఓడించాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు.
పైగా కొడాలి నాని వైరి పక్షం నుంచి పదునైన బాణాలు వేస్తున్నారు. వాటిని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతోంది. దాంతో ఈసారి ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలని టీడీపీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది అంటున్నారు. అయితే పోటీ ఎవరు చేయాలి అన్న దగ్గరే సమస్య వస్తోంది. కొడాలి నాని కోరినట్లుగా లోకేష్ ని బరిలోకి దింపుతారా అంటే ఇప్పటికే ఆయన మంగళగిరిపై ద్రుష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూసినా పార్టీ బలోపేతం చేస్తూ వస్తున్నారు. 2024లో ఆయన కచ్చితంగా గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు. పైగా తండ్రితో పాటు ఆయన కూడా ఏపీ అంతటా ప్రచారం చేయాలనుకుంటున్నారు
. దీంతో సేఫెస్ట్ సీటుని చూసుకుంటే బెటర్ అన్న మాట వినిపిస్తోంది. మరో వైపు బాలయ్యను గుడివాడ బరిలో పెడితే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోందట. బాలయ్యకు హిందూపురం హ్యాపీగా ఉంది. ఆయన ఈసారి గెలిచి కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. దాంతో అక్కడ నుంచి ఆయన రారంటే రారు అని అంటున్నారు. మరి ఎవరు పోటీ అంటే నందమూరి ఫ్యామిలీ నుంచి జయక్రిష్ణ కుమారుడు చైతన్య క్రిష్ణ నేను రెడీ అంటున్నారు. ఆయన ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీల మీద ధాటీగా విమర్శలు చేస్తున్నారు. అయితే చైతన్య క్రిష్ణను పోటీకి పెడితే గట్టిగా ఉంటుందా అన్న బెంగ కూడా ఉందిట. మొత్తానికి చూస్తే కొడాలి చూస్తే బిగ్ సౌండ్ చేస్తున్నారు. కానీ ఇవతల వైపు నుంచి మాత్రం క్యాండిడేట్ తేలడంలేదు. మరి కొడాలితో కొట్లాడేది ఎవరు. ఏమో చంద్రబాబు రాజకీయం గ్రేట్. ఆయన ఈసారి పన్నే పద్మవ్యూహంలో కొడాలి చిక్కుకుంటారా. లేక బయటపడతారా. చూడాలి మరీ.
నానికి ఇబ్బందులు తప్పవా?
అయితే ఇటీవల పరిణామాలు కొడాలి నానికి ప్రతిబంధకంగా మారాయి. ఆయన దూకుడు మంచితో పాటు చెడ్డపేరును తెస్తోంది. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయనకు మేలు చేస్తున్నా భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం జగన్ ప్రాపకం కోసం తమను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని కమ్మ సామాజికవర్గంలో నానిపై ఆగ్రహంతో ఉంది. దీంతో పాటు విపక్ష నాయకులపై ఆయన నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల గుడివాడలో సంక్రాంతికి కెసినో నడిపారన్న ఆరోపణలు చుట్టుముట్టాయి. దీంతో ఆయనపై గుడివాడ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన తన రూటును మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశముంది. దీనికితోడు కేబినెట్ నుంచి ఆయనకు ఉద్వాసన తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా మారితే కష్టాలు తప్పవని భావిస్తున్నారు.
Also Read:AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. స్వరూపాలు.. అతిచిన్న జిల్లాకు ‘పర్యాటకం’ దూరం