https://oktelugu.com/

జేసీ రెడ్డప్ప ఇంత దూకుడు పనికిరాదప్పా?

జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల కేసులో ఇరుక్కొని నెలరోజులుగా జైల్లో ఉంటున్నా కూడా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి సీఎం జగన్ ఎంతో పట్టబట్టి మరీ ఈ జేసీ ఫ్యామిలీని టార్గెట్ చేసి సీమ ప్రతీకారాలు తీర్చుకుంటున్నాడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎదురెళ్లలేక చాలా మంది టీడీపీ నేతలు మౌనం దాల్చారు. కొందరు అజ్ఞాతంలోకి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 7, 2020 / 02:08 PM IST
    Follow us on

    జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల కేసులో ఇరుక్కొని నెలరోజులుగా జైల్లో ఉంటున్నా కూడా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిల తీరు మారకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి సీఎం జగన్ ఎంతో పట్టబట్టి మరీ ఈ జేసీ ఫ్యామిలీని టార్గెట్ చేసి సీమ ప్రతీకారాలు తీర్చుకుంటున్నాడనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఎదురెళ్లలేక చాలా మంది టీడీపీ నేతలు మౌనం దాల్చారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు.

    మరికొందరు వైసీపీలోనే చేరుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకసారి జైలుకు వెళ్లి వచ్చినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తగ్గకపోవడం.. ఏకంగా తొడగొట్టి అడ్డుకున్న పోలీసులను బెదిరించడం సంచలనంగా మారింది.

    జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు. బయటకు రాగానే పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి తన ప్రతాపం చూపించారని తాజా వీడియోను బట్టి తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించారు. నీ అంతు చూస్తానంటూ ఆయన సీఐని బెదిరించడం వీడియోలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో దృశ్యాలు టీవీ చానెళ్లలోనూ ప్రసారమయ్యాయి.

    Also Read: చిరంజీవితో వీర్రాజు బేటీ.. కారణమిదేనా?

    బెయిల్ పై విడుదలై తాడిపత్రికి వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున అనుచరులు వచ్చి ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ లకు దారి కూడా ఇవ్వకుండా జేసీ ర్యాలీ కాన్వాయ్ సాగింది. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులు, సీఐపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. కారు దిగి పోలీసులపైకి ఉరిమి చూస్తూ చేతులు చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. తన అనుచరులతో కలిసి పోలీసులపైకి దూసుకెళ్లారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    కాగా నెలరోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి జైల్లో ఉన్నా ఏమాత్రం తగ్గకుండా బయటకొచ్చాక ఏకంగా పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించడంతో వైసీపీ ప్రభుత్వం కూడా కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యింది. వెంటనే అనంతపురం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డికి షాకిచ్చారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై సెక్షన్ 353తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్టు అనంతపురం పోలీసులు తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం.. వీడియోలో జేసీ ప్రభాకర్ రెడ్డి తిట్టినట్టు కన్ఫం కావడంతో ఇప్పుడు ఆయన చిక్కుల్లో పడ్డట్టు అయ్యింది.

    Also Read: ఈనాడు రామోజీరావుకు షాక్ తగలనుందా?

    సీఎం జగన్ కు ఎదురెళ్లి ఇప్పటికే కష్టాల పాలయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు హయాంలో జగన్ ఫ్యామిలీపై దారుణమైన వ్యాఖ్యలు చేసినందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని ప్రచారం ఉంది. మరి బెయిల్ పై విడుదలై వచ్చాక కూడా అదే దూకుడును జేసీ ప్రభాకర్ రెడ్డి చూపడం ఆయనను మరింత కష్టాల పాలు చేస్తుందన్న విశ్లేషణలు అనంతపురం జిల్లాలో సాగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా ఇంత దూకుడు పనికిరాదని పలువురు నేతలు హితవు పలుకుతున్నారు. ఎంతో ఫైర్ బ్రాండ్ అయిన జేసీ దివాకర్ రెడ్డి సైతం మౌనంగా ఉన్న వేళ ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి మాత్రం తగ్గకపోవడం.. అటు జగన్ సర్కార్ గట్టిగానే ఉండడంతో ఈ ఎపిసోడ్ మరింత రక్తికట్టడం ఖాయమన్న ప్రచారం జిల్లాలో సాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవంటున్నారు.

    వీడియో