https://oktelugu.com/

చిరంజీవితో వీర్రాజు బేటీ.. కారణమిదేనా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి మెగాస్టార్ చిరంజీవితో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోము వీర్రాజు మెగాస్టార్ ను కలుకోవడంలో అంతర్యం ఏంటనే చర్చ ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు తన మిత్రపక్షమైనా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నే కలుసుకోలేదు. వీరిద్దరి ట్వీటర్లో శుభాకాంక్షలు తప్ప నేరుగా ఇప్పటివరకు కలుకున్న దాఖలు లేవు. అలాంటిది చిరంజీవితో సోము వీర్రాజు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2020 2:01 pm
    Follow us on

    Chiranjeevi

    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి మెగాస్టార్ చిరంజీవితో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోము వీర్రాజు మెగాస్టార్ ను కలుకోవడంలో అంతర్యం ఏంటనే చర్చ ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు తన మిత్రపక్షమైనా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నే కలుసుకోలేదు. వీరిద్దరి ట్వీటర్లో శుభాకాంక్షలు తప్ప నేరుగా ఇప్పటివరకు కలుకున్న దాఖలు లేవు. అలాంటిది చిరంజీవితో సోము వీర్రాజు బేటి కావడం వెనుక అంత్యర్యం ఏంటనే చర్చ నడుస్తోంది.

    Also Read: ఈనాడు రామోజీరావుకు షాక్ తగలనుందా?

    ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వీర్రాజు నియామకం అయినప్పటికీ ఆయన దూకుడుగా వెళుతున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరి చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడే నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. పార్టీలోని రెబల్స్ ను ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ముందుకెళుతున్నారు. షోకాజ్ నోటీసులు ఇస్తూ చంద్రబాబు కోవర్టులను ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెల్సిందే. అలాగే ఏపీలోని కాపు సామాజిక వర్గ నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బీజేపీ ఆహ్వానించేందుకు యత్నిస్తున్నారు.

    ఏపీలో బీజేపీ పడేందుకు కాపు సామాజిక వర్గంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాపు నేతలను పార్టీలో భారీగా చేర్చుకునేందుకు యత్నిస్తుంది. ఏపీలోని కాపు సామాజిక వర్గంలోని నేతలు అటు వైసీపీ, టీడీపీ, జనసేనలకు మద్దతు ఇస్తుండటంతో ఓట్లు చిలీపోతున్నాయి. ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సొము వీర్రాజు తాజాగా చిరంజీవితో బేటి అయినట్లు తెలుస్తోంది.

    Also Read: ప్రభుత్వానికి న్యాయపరమైన చిక్కులు తప్పవా?

    చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కాపు సామాజికవర్గంలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. మోగస్టార్ మద్దతును కూడగట్టడం ద్వారా వీర్రాజు అడుగులు పక్కాగా పడుతున్నాయనే టాక్ విన్పిస్తుంది. కాపు నేతలందరినీ సోము వీర్రాజు ఐక్యం చేసేందుకు యత్నిస్తున్నారనే సంకేతాలు బయటికి వెళుతున్నాయి. ఇది బీజేపీకీ కలిసొచ్చే అంశమే. ఇక జనసేనకు కూడా కాపుల్లో మంచి ఓటు బ్యాంకు ఉంది. 2024 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకును గంపగుత్తగా లాగి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోంది. ఇందులో భాగంగానే సోము వీర్రాజు మెగాస్టార్ ఇంటికి వెళ్లి భేటి అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి బేటి రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది.