Tollywood industry updates : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళ నుంచి రాబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను అందిస్తారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ రీతిలో మన తెలుగు ప్రొడ్యూసర్స్ సైతం వాళ్ళ సత్తాని చాటుతున్నారు. ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయిన సరే భయపడకుండా పెట్టేస్తున్నారు. ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరు కూడా ఇంతకుముందు ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. గత పది సంవత్సరాల నుంచి మాత్రమే వాళ్ళు టాప్ పొజిషన్ ని కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగుందిన ఎమ్మెస్ రాజు మహేష్ బాబు తో ‘ఒక్కడు’, ప్రభాస్ తో ‘వర్షం’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఇక ఆయన ఈ మధ్యకాలంలో అసలు సినిమాలు చేయడం లేదు. కారణం ఏంటి అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు… గతంలో ఆయన ఒకటి రెండు సినిమాలకు డైరెక్షన్ చేశాడు. కానీ ఆ సినిమాలు కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన అటు ప్రొడ్యూసర్ గా ఇటు దర్శకుడి గాను కొనసాగలేకపోయాడు.
తన కొడుకు అయిన సుమంత్ అశ్విన్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయనకు పెద్దగా సక్సెసు లైతే రాలేదు. దానివల్ల ఆయనను కూడా సినిమాల్లో హీరోగా ఎవరు తీసుకోవడం లేదు… మొత్తానికైతే ఎమ్మెస్ రాజు టాప్ ప్రొడ్యూసర్ గా తన కెరియర్ ను కోల్పోయిందే కాకుండా తన కొడుకు కెరియర్ ను బిల్డ్ చేయడంలో చాలా వరకు ఫెయిల్ అయిపోయాడు.
ఇక ప్రభాస్, మహేష్ బాబు లాంటి హీరోలకు సక్సెస్ లను అందించిన ఆయన ఎందుకని స్టార్ ప్రొడ్యూసర్ గా మారలేకపోయారు అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న… వర్షం మూవీ తర్వాత ఆయన చేసిన సినిమాల విషయంలో అసలు కేర్ తీసుకోలేదు. అందువల్లే ఆయన నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టు గా ఫ్లాప్ అయ్యాయి.
దానివల్ల ఆయన భారీగా మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక డైరెక్షన్ అంటూ ఒకటి రెండు సినిమాలకు డైరెక్షన్ చేయడం వల్ల అటు ప్రొడ్యూసర్ గా, ఇటు డైరెక్టర్ గా రెండింట్లోనూ ఫెయిల్ అయిపోయాడు… ఫైనల్ గా ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయాడనే చెప్పాలి…