Pawan Kalyan- Minister Viswarup: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. సమకాలీన అంశాలపై సానకూలంగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశంలో కూడా కూల్ గా వ్యవహరిస్తున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు, చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితుడేనన్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మంత్రి విశ్వరూప్ మంచి వ్యక్తిగా కితాబిచ్చారు. రాజకీయాల కోసం విధ్వంసం స్రుష్టించే వ్యక్తి కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటకు కట్టుబడి ఉన్నాను. ఈ విషయం పదేపదే చెప్పాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు. పొత్తు నేపథ్యంలో… తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందనేది ఎవరి ఆశ అయినా కావొచ్చునని పవన్ వ్యాఖ్యానించారు. తనకు మాత్రం అలాంటి ఆశ లేదన్నారు. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ… ‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ… ‘ఒంటరిగా పోటీ చేసే మీకు… ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు?’ అని పవన్ ప్రశ్నించారు.
గతానికి భిన్నంగా..
ఇక బీజేపీతో సంబంధాలపై పవన్ కళ్యాణ్ గతానికి భిన్నంగా వ్యాఖ్యానించారు. తనకు ఢిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధమని.. ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మహానాడు సక్సెస్ అయితే మంచిదే అని అన్నారు. వైసీపీ పాలన బాగుంటే పొత్తుల ప్రస్తావన ఎందుకొస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కొన్ని కులాలను వైసీపీ శత్రువులుగా భావిస్తోందని.. కమ్మ,కాపు, బీసీ, మత్స్యకార కులాలను శత్రువులుగా చూస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Also Read: Chandrababu-NTR Family: చంద్రబాబు, ఎన్టీఆర్ ఫ్యామిలి..దూరం పెరిగిందా? అసలు కథేంటి?
పవన్ కళ్యాణ్ పలు అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తనకు ఏపీ బీజేపీ నేతలతో సంబంధం లేదని.. తనకు ఢిల్లీ బీజేపీ నేతలతోనే సంబంధం అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు.దీన్ని బట్టి ఆయన ఏపీ బీజేపీ నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదని.. వారి నిర్ణయాలతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ బీజేపీ నేతలను అవమానపరిచేలా ఉన్నాయనే వాదన కూడా ఉంది. మరి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
అన్నివర్గాలు వైసీపీకి దూరం..
వైసీపీ ఉన్నంతవరకు పోలవరం పూర్తి కాదని.. కొట్టడం తమ హక్కుగా వైసీపీ భావిస్తోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఉద్రిక్తతలు తగ్గాక కోనసీమలో (పర్యటిస్తానని అన్నారు. 2019లో సమాజంలోని అన్ని కులాలూ మతాలూ కలసి ఓటేస్తేనే వైసీపీకి 151 స్థానాలు దక్కాయని పవన్ పేర్కొన్నారు. కానీ… జగన్ వర్గ రాజకీయాలు చేస్తూ ఒక్కొక్కరిని దూరం చేసుకుంటున్నారని తెలిపారు. వైసీపీకి కమ్మ, కాపు, బీసీ వర్గాలు ఇప్పటికే దూరమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా దూరమవుతున్నాయని… చివరికి జగన్ ఒంటరిగా మిగులుతారని పవన్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అంటే… యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ! కానీ… యువజనులకు ఉద్యోగాలు లేకుండా చేసింది. శ్రామికులకు ఉపాధి పోయింది. రైతులకు కనీస మద్దతు ధర లేకుండా, కౌలు రైతులకు కార్డులు లేకుండా చేసింది. తన పార్టీ పేరులో ఉన్న వర్గాలకే న్యాయం చేయని జగన్ ఇంకెవరికి చేస్తారు?వైసీపీ హయాంలో పోలవరంతో సహా ఏ ప్రాజెక్టులూ పూర్తి కావు. కేంద్ర నిధులను ఇతర పద్దులకు మళ్లిస్తుంటే… పోలవరం ఎలా పూర్తవుతుందని కేంద్రపెద్దలు నాతో అన్నారు.వైసీపీ నేతలు అందరినీ కొడుతున్నారు. ఇరిగేషన్ ఇంజనీరును, ఆర్డీవోను కొట్టడంలో ఆశ్చర్యమేముంది!? వైసీపీ అధ్యక్షుడే ఒకప్పుడు పులివెందులలో ఒక పోలీసు అధికారిని కొట్టినట్లు మానవ హక్కుల నివేదికలో ఉంది.
Also Read:Pawan Kalyan Janasena: సంచలన సర్వే.. ఏపీలో జనసేన గెలుపునకు అదొక్కటి చేస్తే చాలు!
Recommended Videos