Chandrababu-NTR Family: తెలుగునాట కుటుంబ రాజకీయాలకు కొత్తేమీ కాదు. టీడీపీ ఆవిర్భావంతో నందమూరి, నారా కుటుంబాలు తెరపైకి రాగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబం ప్రాబల్యం బాగా పెరిగింది. అయితే కుటుంబ విభేదాలను రాజకీయాలకు వాడుకోవడం పరిపాటి. ఎన్టీఆర్ పదవి విచ్యుతుడ్ని చేయడంలో బయట వారి పాత్ర కంటే కుటుంబసభ్యుల పాత్రే అధికం. ఆశించిన పదవులు దక్కకపోతే కరివేపాకులా వాడేసుకున్నారని ఆరోపిస్తారు. తీరా సమాన పదవులు దక్కితే ఆధిపత్యం ప్రదర్శిస్తారు. వైఎస్ కుమార్తె షర్మిళను సోదరుడు జగన్ అవసరం తీరాక వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే ఇదంతా ఇన్ సైడ్ లో వెలుగుచూసినవే. తాజాగా టీడీపీ, చంద్రబాబు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నందమూరి హీరో తారకరత్న. గత కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న ఇటీవల ఓ ఇంర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో నందమూరి కుటుంబానికి ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నందమూరి కుటుంబసభ్యులను దరి చేరనీయడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ అభూతకల్పనలేనని తేల్చిచెప్పారు. టీడీపీ తెలుగువాడి పార్టీ… అన్నగారు తెలుగు ప్రజలకోసం పెట్టిన పార్టీ అన్నారు. ఎప్పుడు కూడా ఆయన తర్వాత పార్టీకి మేం అని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. మా పార్టీ అని కూడా నేను అననని.. మన పార్టీ అంటానని తారకరత్న బదులిచ్చారు.
టీడీపీ పగ్గాలు నందమూరి కుటుంబసభ్యులకు అందకుండా చంద్రబాబు చేస్తున్నారన్న యాంకర్ ప్రశ్నకు తారకరత్న దీటుగా సమాధానం చెప్పారు. నందమూరి కుటుంబసభ్యులు టీడీపీ పగ్గాలు అందుకోండి అని సూచించిన వరకూ బాగానే ఉంది.. కానీ చంద్రబాబు నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టారన్నది సత్యదూరమన్నారు. అలాంటి మాటల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. అవన్నీ ఊహాజనితమే అన్నారు. మామయ్య చంద్రబాబు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించరే కానీ.. నందూమరి ఫ్యామిలీని రానివ్వకూడదని ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. ఆయనకు నిజంగా అలా ఉంటే.. ఆయన మమ్మల్ని ఎన్నికల ప్రచారానికి కూడా రానిచ్చేవారు కాదన్నారు. అయితే రాజకీయాలు వేరు.. ఎన్నికల ప్రచారం వేరు. ప్రచారానికి వాడుకొని… విజయమ్మ, వైఎస్ షర్మిలను కూడా జగన్ పక్కన పెట్టేశారన్న విమర్శలను యాంకర్ గుర్తుచేశారు. ఇటువంటి పరిస్థితి మీకెప్పుడైనా తలెత్తిందని తారకరత్నను ప్రశ్నించగా.. మాకు ఎప్పుడు అలాంటిది ఏం జరగలేదన్నారు.
Also Read: Pawan Kalyan Janasena: సంచలన సర్వే.. ఏపీలో జనసేన గెలుపునకు అదొక్కటి చేస్తే చాలు!
చాలా క్లారిటీతో చెబుతున్నాను…ఏ రోజు మమ్మల్ని మామయ్య చంద్రబాబు దూరంగా పెట్టలేదన్నారు. మాకు ఎప్పుడు ఏం కావాలన్న.. ఏ సమస్య వచ్చిన మామయ్య మాకిది కావాలి… ఈ సమస్య ఉంది అని చెప్పుకొనే స్వేచ్ఛ, ధైర్యం చంద్రబాబు వద్ద తమకు ఉన్నాయన్నారు. పార్టీలో పలానా పదవి కావాలని అడిగినా ఇస్తారన్నారు. కానీ దానికి పరిణితి, అనుభవం కావాలన్నారు. . మా అత్తయ్య భువనేశ్వరి.. ఇవాల్టికి ఓ అమ్మలాగా మమ్మల్ని కూర్చొని మాట్లాడి పంపించే వ్యక్తి అన్నారు. నారా, నందమూరి కుటుంబాల్ని వేరేగా చూడలేమన్నారు. చంద్రబాబు నా మేనమామ.. మేమంతా ఒకటేనని తారక్ రత్న బావోద్వేగంతో చెప్పారు.
గత కొంతకాలంగా తారకరత్న టీడీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి సైతం వస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. నందమూరి కుటుంబం నుంచి ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న తారకరత్న.. ఈ సినిమా తరువాత వరుసగా 13 సినిమాలకు సైన్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు. సినిమా హీరోగా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో విలన్ గా మారాడు. అమరావతి చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు… సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన 9 అవర్స్ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భవిష్యత్ లో టీడీపీకి సేవలందించనున్నట్టు తారక్ మాటల ద్వారా తేటతెల్లమైంది.
Also Read: YCP: చున్నీతో కట్టేసి.. వైసీపీ పాలనలో కాళ్లు మొక్కినా కనికరించలేదు
Recommended Videos