Janasena : జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక సమావేశం ఏపీలోని మంగళగిరిలో జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసింది. అవేంటి? ఏపీ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది తెలుసుకుందాం.

-అరాచక పాలనకు ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని జనసేన గళం వినిపస్తుంది.
-సామాన్యుల బాధలు తెలుసుకుంటూ వారిని ధైర్యాన్ని నింపేలా జనవాణి నిర్వహించాలి.
-విశాఖలో పవన్ కళ్యాణ్ అడ్డుకున్న వ్యవస్థలను దుర్వినియోగం చేసి భయానక పరిస్థితులను సృష్టించారు.
-ప్రభుత్వ వ్యవస్థలు దుర్వినియోగం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటం చేయాలని జనసేన తీర్మానం
-వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఖండిస్తూ బీజేపీ సీనియర్ నేతల మద్దతును జనసేన స్వాగతించింది. వారికి పవన్ సంఘీభావం తెలిపారు.
-తెలంగాణకు చెందిన నాయకులు, మేధావులు, ప్రతినిధుల నుంచి వైసీపీ ప్రభుత్వ చర్యలకు ఖండన.. జనసేనకు మద్దుతపై పవన్ సంఘీభావం తెలిపారు.
-విశాఖలో కేసుల్లో ఇరుక్కున్న జనసేన నేతలు, వీర మహిళలకు మనో ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్ కు జనసేన నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
-విశాఖ అక్రమకేసుల్లో ఉన్న ప్రతీ కార్యకర్త, ప్రతీ నాయకుడు రక్షించుకొనే బాధ్యతను జనసేన తీసుకుంటుందని తీర్మానం చేశారు. అక్రమ కేసుల్లోని వారికి న్యాయపరమైన సహాయం చేయాలని జనసేన నిర్ణయించింది.
ఈ కీలక తీర్మానాలను జనసేన సిద్ధం చేసింది. వీటిని నిక్కచ్చిగా అమలు చేసి అధికార వైసీపీని ఇరుకునపెట్టాలని తీర్మానించారు.