https://oktelugu.com/

బీజేపీతో ఇక తెగదెంపులేనా..?

ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. కొన్ని చోట్ల మినహా దాదాపు అధికార పార్టీ జెండానే రెపరెపలాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీఎక్కడ లోపం జరుగిందా..? అని చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో మిగతా చోట్ల కంటే విజయవాడలో పట్టుంది అని చెప్పుకొచ్చిన జనసేన పార్టీకి కోలుకోని దెబ్బ తగిలింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ ఓటమికి బీజేపీయే కారణం అని చెబుతోంది. అసలు విషయమేమిటంటే జనసేనకు […]

Written By: , Updated On : March 15, 2021 / 08:40 PM IST
Janasena BJP
Follow us on

Janasena BJP

ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. కొన్ని చోట్ల మినహా దాదాపు అధికార పార్టీ జెండానే రెపరెపలాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీఎక్కడ లోపం జరుగిందా..? అని చర్చించుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీలో మిగతా చోట్ల కంటే విజయవాడలో పట్టుంది అని చెప్పుకొచ్చిన జనసేన పార్టీకి కోలుకోని దెబ్బ తగిలింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా గెలుచుకోకపోవడంతో ఆ పార్టీ ఓటమికి బీజేపీయే కారణం అని చెబుతోంది. అసలు విషయమేమిటంటే జనసేనకు ఓటింగ్ శాతం తగ్గి బీజేపీకి పెరిగింది. అయితే ఆ ఓట్లన్నీ జనసేనవేనని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

జనసేన విజయవాడ ఇన్ చార్జిగా ఉన్న పోతినేని మహేశ్ ఇటీవల ఎన్నికల ఫలితాలపై మాట్లాడారు. తమ ఓటమికి కారణం బీజేపీతో పొత్తువల్లనేనని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు మిస్సయి అనడం లేదని ఖరాఖండిగా చెబుతున్నానని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉండడం వల్ల ఆ పార్టీ వార్డులు గెలుచుకోకపోయిన జనసేన ఓట్ల శాతం అటు మళ్లిందని అన్నారు. అయితే కమలం పార్టీ పొత్తుతో మైనార్టీలు జనసేనకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ బీజేపీ నాయకులను ఉద్దేశించి ‘గౌరవం లేని చోట నేనుండను’ అని వ్యాఖ్యానించారు. దీంతో అటు తెలంగాణలో ఇటు ఏపీలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే బెటరని జనసైనికులు ఆలోచిస్తున్నారు. ఇక మిగతా ప్రాంతాల వారు సైతం బీజేపీతో పొత్తుతో ఎలాంటి నష్టం జరిగిందో ఫీడ్ బ్యాక్ అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఆసక్తి నెలకొంది.

గత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన గెలిచింది. అయితే అలాంటి ప్రదేశాల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లడం వల్ల తమ పార్టీని ఆదరించారని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో కలిసి వెళ్లడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోకపోతే రాను రాను మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని జనసేన పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.