https://oktelugu.com/

క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిషేధం విధించనుందా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ క్రిప్టోక‌రెన్సీల‌కు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. క్రిప్టో కరెన్సీ కోసం కేంద్రం సరికొత్త చట్టం అమలు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. కేంద్రం క్రిప్టో కరెన్సీని నిషేధించడంతో పాటు క్రిప్టో కరెన్సీతో ట్రేడింగ్ చేసినా భారీ మొత్తం జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. Also Read: ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..? మ‌న దేశంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 15, 2021 / 08:17 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ క్రిప్టోక‌రెన్సీల‌కు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. క్రిప్టో కరెన్సీ కోసం కేంద్రం సరికొత్త చట్టం అమలు దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. కేంద్రం క్రిప్టో కరెన్సీని నిషేధించడంతో పాటు క్రిప్టో కరెన్సీతో ట్రేడింగ్ చేసినా భారీ మొత్తం జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    Also Read: ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

    మ‌న దేశంలో బిట్‌కాయిన్‌, డోజ్‌కాయిన్‌, ఇత‌ర క్రిప్టోక‌రెన్సీలు క‌లిగి ఉన్న‌వారిపై కేంద్రం తీసుకొచ్చే చట్టం ప్రభావం తీవ్రంగా పడనుందని తెలుస్తోంది. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మీడియాతో మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ కలిగి ఉన్నా, వాటిని జారీ చేసినా, ట్రేడింగ్ చేసినా నేరంగా ప‌రిగ‌ణించాల‌ని కొత్త చ‌ట్టం ప్రతిపాదించినట్లు తెలిపారు. క్రిప్టోక‌రెన్సీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇన్వెస్టర్లలో ఆందోళనకు కారణమవుతోంది.

    Also Read: పెన్షన్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..?

    భారత్ లో ఈ చట్టం అమలులోకి వస్తే మాత్రం క్రిప్టోక‌రెన్సీపై నిషేధం విధించిన తొలి దేశంగా భారత్ నిలుస్తుందనడంలో సందేహం లేదు. చైనా క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించినప్పటికీ క్రిప్టో కరెన్సీ కలిగి ఉండటం నేరమని పేర్కొనలేదు. మన దేశంలో కేంద్రం నిషేధం విధించినా క్రిప్టో ఆస్తుల‌ను న‌గ‌దు రూపంలోకి మార్చుకోవ‌డానికి 6 నెలల సమయం ఇవ్వనున్నట్టు కీలక ప్రకటన చేసింది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    దేశంలో 70 ల‌క్ష‌ల మంది ద‌గ్గ‌ర క్రిప్టోక‌రెన్సీ ఉండగా 100 కోట్ల డాల‌ర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిట్‌కాయిన్ విలువ 60 వేల డాల‌ర్ల మార్క్‌ దాటగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం క్రిప్టో కరెన్సీలను మొత్తంగా బ్యాన్ చేసే దిశగా కేంద్రం అడుగులు వేయడం గమనార్హం. ఆర్బీఐ క్రిప్టో కరెన్సీ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె అన్నారు.