జనసేన–బీజేపీ సీఎం అభ్యర్థి పవన్ యేనా?

తెలంగాణ రాష్ట్రంలో అంతోఇంతో బలంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై కన్నేసిందా..? ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన ఆ పార్టీ ఇప్పుడు జనసేనానితో జత కట్టాలని చూస్తోందా..? కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌కల్యాణ్‌.. రేపటి సీఎం అభ్యర్థి కాబోతున్నాడా..? జనసేనతో కలిసి బీజేపీని బలోపేతం చేయాలని ఆలోచన చేస్తోందా..? ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి నుంచే ఆసక్తి కరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీని […]

Written By: NARESH, Updated On : September 3, 2020 1:56 pm
Follow us on


తెలంగాణ రాష్ట్రంలో అంతోఇంతో బలంగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై కన్నేసిందా..? ఇటీవలే రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన ఆ పార్టీ ఇప్పుడు జనసేనానితో జత కట్టాలని చూస్తోందా..? కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌కల్యాణ్‌.. రేపటి సీఎం అభ్యర్థి కాబోతున్నాడా..? జనసేనతో కలిసి బీజేపీని బలోపేతం చేయాలని ఆలోచన చేస్తోందా..? ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అవుననే సమాధానమే వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి నుంచే ఆసక్తి కరంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీని మట్టికరింపిచ బంపర్‌‌ మెజార్టీతో గద్దెనెక్కిన సీఎం జగన్‌కు చెక్‌ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దేశం మొత్తం బీజేపీ గాలివీస్తుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏపీలో ఆ పార్టీకి వచ్చిన సీట్లు సున్నా. కాంగ్రెస్‌ మాత్రం ఖాతా తెరిచిందా అంటే అదీ సున్నాకే పరిమితమైంది. అయితే రాష్ట్ర విభజనతో ఆ పార్టీ తన మైలేజ్‌ కోల్పోయిందనే చెప్పొచ్చు. దేశంలో చక్రం తిప్పిన బీజేపీ.. ఏపీలో మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయింది. టీడీపీతో మైత్రి వల్ల లాభం లేదనుకున్న బీజేపీ తన సొంత ఓటు బ్యాంకుపైనే ఫోకస్‌ పెట్టింది.

అందుకే పార్టీని నడిపించేందుకు సమర్థవంతమైన నాయకత్వం ఉండాలని అధిష్టానం ఆలోచన చేసింది. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదిపేందుకు ముందుగా రాష్ట్ర అధ్యక్ష మార్పిడి చేపట్టింది. ఇందులోభాగంగా సోము వీర్రాజును బాస్‌గా ప్రకటించింది. పోనీ ఈయనకు పొలిటికల్‌గా మాస్‌ ఫాలోయింగ్‌ ఉందా అంటే అదీ లేదు. మరి ఏ నేపథ్యంలో సోము వీర్రాజును అధిష్టానం ప్రకటించిందో తెలియకుండా ఉంది. అయితే.. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన దూకుడుగా వ్యవహరిస్తున్నారడంలో అతిశయోక్తి లేదు.

మరోవైపు బీజేపీ జనసేనతో మైత్రి కోసం ఇటీవల మెగా హీరోలతో భేటీ అయ్యారు సోము వీర్రాజు. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ తమ మిత్రపక్షమని ప్రకటించిన బీజేపీ.. జనసేనానికి కేంద్రంలో ఓ పదవి రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై సోము వీర్రాజును స్పందిస్తే పవన్‌కల్యాణ్ పదవి అడిగే వ్యక్తి కాదని.. కానీ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తిగా పేర్కొన్నారు. వారి ఆలోచనలు, మోడీ ఆలోచనలు ఒకేతీరుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే ముందుగా కేంద్రంలో ఓ పదవి ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నికల టైం వరకు బీజేపీ–జనసేన సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్‌ను ప్రకటించాలని ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరి బీజేపీ కలలకు జనసేనాని ఏ మేరకు న్యాయం చేయగలడు..? జగన్‌ ధాటిని తట్టుకొని ఎదురు నిలువగలుగుతాడా అనేది వేచిచూడాలి?