సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమా నిర్మాణం పై కూడా బాగా ఆసక్తి ఎక్కువ. అందుకే ఎంబీ ప్రొడక్షన్స్ అనే తన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు. తన ప్రతి సినిమాని ఈ కంపెనీలో ఇన్ వాల్వ్ చేయడం మహేష్ ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నాడు. ఆవతల ఎంత బడా ప్రొడ్యూసర్ ఉన్నా.. ప్రొడక్షన్ విషయంలో తన కంపెనీ నుండి కూడా పక్కా లెక్కల వ్యవహారాలు ఉండాలనేది మహేష్ కండీషన్. ఏమైనా మహేష్ పర్ఫెక్ట్ యాక్టర్ తో పాటు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా కూడా బాగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఏ హీరో చేయలేని, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ ను కూడా సమర్ధవంతంగా హ్యాండిల్ చేస్తున్నాడు.
Also Read: ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?
పైగా తన ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ.. తన ప్రొడక్షన్ కంపెనీని ఇంకా విస్తృత పరుస్తున్నాడు మహేష్. ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తూనే మరో యంగ్ హీరోతో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉందని నిరూపించుకున్నాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు నవీన్. అయితే రీసెంట్ గా ఈ సినిమాని మహేష్ చూశాడట. సినిమాలో నవీన్ కామెడీ టైమింగ్ మహేష్ కి బాగా నచ్చిందని.. అందుకే తన ప్రొడక్షన్ లో నవీన్ తో ఓ సినిమా చేయాలని.. ఇప్పటికే నవీన్ తో కూడా మంచి కథ ఉంటే తీసుకురా.. మన ప్రొడక్షన్ లో సినిమా చేద్దాం అని మహేష్ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: వయసు ముదిరినా తరగని అందం..
కాగా అనిల్ రావిపూడి దగ్గర అసిస్టెంట్ గా చేసిన వీర శేఖర్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నవీన్ కి బాగా నచ్చడంతో.. ఈ కథనే మహేష్ దగ్గరకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడట. మహేష్ కి కథ నచ్చితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం. నవీన్ పొలిశెట్టి నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా యూత్‌లో నవీన్ కి మంచి క్రేజ్ ఉంది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మహేష్ బ్యానర్ లో మరో సినిమాని పట్టేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నవీన్ పొలిశెట్టి రేంజ్ అమాంతం పెరగడం గ్యారంటీ అనుకుంటున్నారు సినీ జనాలు.