Nadendla Manohar: వైసీపీ నేతలు, జగన్ ను చూసి భయపడేది లేదు: నాదెండ్ల

Nadendla Manohar: జనసేన ఆవిర్భావ సభకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని..తమకు అనుమతి ఇవ్వకుండా స్థలం కేటాయించకుండా బెదిరించిందని..కానీ ఇప్పటం గ్రామ ప్రజలు వైసీపీ సర్కార్ ను, జగన్ ను ఎదురించి జనసేన సభకు తమ భూములు ఇచ్చారని..వారికి పాదాభివందనం అంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రైతులే ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు అందించారని.. జనసేన పార్టీనే రోడ్లు వేయించిందని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేశారని.. దాదాపు 9 అంతస్థుల రాజధాని భవనాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని […]

Written By: NARESH, Updated On : March 14, 2022 8:09 pm
Follow us on

Nadendla Manohar: జనసేన ఆవిర్భావ సభకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని..తమకు అనుమతి ఇవ్వకుండా స్థలం కేటాయించకుండా బెదిరించిందని..కానీ ఇప్పటం గ్రామ ప్రజలు వైసీపీ సర్కార్ ను, జగన్ ను ఎదురించి జనసేన సభకు తమ భూములు ఇచ్చారని..వారికి పాదాభివందనం అంటూ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రైతులే ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు అందించారని.. జనసేన పార్టీనే రోడ్లు వేయించిందని నాదెండ్ల చెప్పుకొచ్చారు.

Nadendla Manohar

ఏపీ రాజధాని అమరావతిని నాశనం చేశారని.. దాదాపు 9 అంతస్థుల రాజధాని భవనాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వృథాగా వదిలేసి కోట్లరూపాయలు నీళ్ల పాలు చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జనసేన అస్త్ర యాప్ ద్వారా ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త యాప్ ను తెస్తున్నారని విమర్శించారు. పవన్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కష్టపడాలని సూచించారు.

Also Read: Telangana Unemployed People: తెలంగాణ నిరుద్యోగులూ.. ఇక రెడీ కండి!

ఎందరో నాయకులు పార్టీ వదిలివెళ్లినా కార్యకర్తలు, మహిళలు పార్టీని బతికించారని నాదెండ్ల అన్నారు. గ్రామ గ్రామాన పార్టీ సభ్యత్వం పెరిగిందని పార్టీ మరింత విస్తరిస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలిస్తానన్న జగన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని.. ఉద్యోగాలు లేవని.. ప్రభుత్వ సంస్థలు ఇవ్వడం లేదని.. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని నాదెండ్ల ఆరోపించారు.

ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని..పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారని నాదెండ్ల ఆరోపించారు. మన పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే ఈ రాజకీయ సంస్కరణ జరుగుతుందని నాదెండ్ల అన్నారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం బలపడిందన్నారు.

జగన్ వల్ల ఒక్క పరిశ్రమ రావడం లేదని.. పెట్టుబడి పెట్టడానికి రావడం లేదని.. ఒక్క పారిశ్రామికవేత్త రాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని నాదెండ్ల అన్నారు. క్షేత్రస్థాయిలో దౌర్జన్యాలు, బెదిరింపులు ఏపీలో ఉన్నాయని ఆరోపించారు. మత్స్యపురిలో జనసేన గెలిచిందని ఒక దళిత మహిళపై దాడి చేసి ఇల్లు కూలగొట్టారని నాదెండ్ల మండిపడ్డారు. ఆ మహిళకు పవన్ కళ్యాణ్ 12 లక్షలతో ఇల్లు కట్టించాడని నాదెండ్ల తెలిపారు.

Also Read: Ganta Srinivasarao: రాజీనామా కోసం గంటా పట్టు.. జనసేనలోకి జంపింగా?

జనసేనపై, పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి మరీ దుష్ప్రచారం చేస్తున్నారని.. మీరు పవన్ వెంట నిలిచి వైసీపీని ఓడించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు.