Pavan Kalyan In Fire: తగ్గేదేలే..! పవన్ ప్లవర్ కాదు.. ఫైర్.. ఇక అంటుకోవడం ఖాయం!

Pavan Kalyan In Fire: ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఆవిర్భావం సభ జరుగుతోంది. ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్ ఏం సందేశం ఇవ్వనున్నారో అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో పవన్ ఎటు వైపు మొగ్గుతారో అనే విషయంలోనే అందరికి ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ నిర్ణయంపైనే అందరు ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభ ద్వారా కార్యకర్తలకు, నేతలకు పవన్ సందేశం […]

Written By: Srinivas, Updated On : March 14, 2022 7:37 pm
Follow us on

Pavan Kalyan In Fire: ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఆవిర్భావం సభ జరుగుతోంది. ఈ సభ ద్వారా పవన్ కల్యాణ్ ఏం సందేశం ఇవ్వనున్నారో అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో పవన్ ఎటు వైపు మొగ్గుతారో అనే విషయంలోనే అందరికి ఉత్కంఠ ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ నిర్ణయంపైనే అందరు ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు.

జనసేన ఆవిర్భావ సభ ద్వారా కార్యకర్తలకు, నేతలకు పవన్ సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయాలను శాసించే విధంగా జనసేన ముందుకు వెళ్తుందని చెప్పిన నేపథ్యంలో ఆయన ఏ మేరకు స్పందిస్తారో అని అందరిలో ఉత్సాహం పెరుగుతోంది. బీజేపీతో పొత్తు ఉండటంతో అది కూడా నాలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి మోగించిన సందర్భంలో పవన్ మాటలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అనే సందేహాలు వస్తున్నాయి.

Pavan Kalyan

ఇప్పటికే జనసేన జనంలోకి వెళ్తోంది. ప్రజాసమస్యలపై పట్టు కోసం పరితపిస్తోంది. గతంలో రోడ్ల దుస్థితిపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను తప్పుబట్టింది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆక్షేపిస్తూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఆయన సినిమాలను జగన్ టార్గెట్ చేసుకున్నా లెక్కపెట్టలేదు. దీంతో ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ సినిమాకు కూడా టికెట్లు రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందనేది తెలిసిందే.

Also Read: Deaths In Jangareddygudem: డాక్ట‌ర్లే చెప్ప‌కుండా మీకెలా తెలిసింది జ‌గ‌న్‌.. జంగారెడ్డి గూడెం మ‌ర‌ణాల‌పై ఇలాంటి కామెంట్లా..?

పవన్ కల్యాణ్ తాను చెప్పదలుచుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. అందుకే ఏ విషయాన్ని అయినా సూటిగా చెబుతారు. దీంతో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ముక్కుసూటితనంగానే వెళ్తున్నారు. ఏ విషయాన్ని అయినా నిలదీయడం అలవాటుగా చేసుకున్నారు. అందుకే రాజకీయాల్లో కూడా తప్పులను క్షమించేది లేదని చూస్తున్నారు. ఏ తప్పు జరిగినా దాన్ని ఎండగడుతున్నారు. ఇందులో భాగంగానే సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసినా ఆయనకు ఎవరు కలిసి రాలేదు. ఫలితంగా సినిమాల పరిస్థితి అధ్వానంగా మారినా అందరు చోద్యం చూశారే కానీ పవన్ వ్యాఖ్యలు సరైనవే అని ఎవరు చెప్పకపోవడం గమనార్హం.

ఇక పొత్తుల విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాల దృష్ట్యా పవన్ కల్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అనే మీమాంస అందరిలో ఏర్పడింది. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో ఇప్పటికే దాంతో మైత్రి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ కూడా జనసేన వైపు చూస్తోంది. చంద్రబాబు పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలనే చూస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏ మేరకు స్పందించి నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫ్లవర్ కాదు.. ఫైర్ అని నిరూపించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఆ నిప్పును ఈ ఆవిర్భావ సభతో అంటించి ప్రత్యర్థులకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మొదలైన ఈ సభలో ఎలాంటి స్టేట్ మెంట్లు ఇస్తారన్నది వేచిచూడాలి.

Also Read: Janasena-TDP: టీడీపీతో వెళితే పవన్ కు లాభమా? నష్టమా? కార్యకర్తల డిమాండ్లు ఇవీ!

Tags