అభిమానుల్లో మిమ్మల్ని కొట్టేవారు లేరు..! జనసైనికులా మజాకా?

2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ “గెలిస్తే ప్రజలకు న్యాయం చేస్తాం… ఓడినా ప్రజలకు సాయం చేస్తాం” అని చెప్పింది. మిగతా నాయకులు తమ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో తెలియదు కానీ…. పవన్ కళ్యాణ్ మాత్రం అతని మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో సాయం చేయడంలో జనసేన పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. Also Read : బుక్కైన దేవినేని ఉమ.. […]

Written By: Navya, Updated On : August 28, 2020 10:21 am
Follow us on

2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ “గెలిస్తే ప్రజలకు న్యాయం చేస్తాం… ఓడినా ప్రజలకు సాయం చేస్తాం” అని చెప్పింది. మిగతా నాయకులు తమ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో తెలియదు కానీ…. పవన్ కళ్యాణ్ మాత్రం అతని మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా గ్రౌండ్ లెవెల్ లో సాయం చేయడంలో జనసేన పార్టీ తనదైన ప్రత్యేకతను చాటుకుంది.

Also Read : బుక్కైన దేవినేని ఉమ.. నెక్ట్స్ టార్గెట్ అతడేనట?

విషయం ఏమిటంటే…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసైనికులు పెద్ద ఎత్తున పేదలకు సాయం అందించే కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితి మీద ఉన్న అవగాహనతో ఈ కరోనా నేపథ్యంలో…. ‘జనసేవ’ పేరుతో ఆక్సిజన్ సిలిండర్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు విరాళంగా ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తున్నారు. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమం విస్తృతంగా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు విదేశాల్లో ఉంటున్న జనసేన మద్దతు దారులైన ఎన్నారైలు కూడా తమ వంతు సాయం అందించడం విశేషం.

ఇటీవల వరదల నేపథ్యంలో కూడా జనసైనికులు అందించిన సహాయం చాలా చాలా గొప్పది. ఇంకా జనసేన కార్యకర్తలు ఇంత గొప్ప విషయం చేస్తుంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ ‘జనసేవ’ ను గుర్తించడం లేదు అనుకోండి అది వేరే విషయం. అయినా కానీ అధికారంలో ఉన్నోడు ‘బొమ్మ’తో పబ్లిసిటీ చేసుకుని సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం…. అధికారం లేనోడు అడ్డగోలుగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తున్న మనం…. రాజకీయం అంటే ‘ప్రజాసేవ’ అని నమ్మిన వాడు మాత్రం గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సాయం చేస్తాడు అని ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూస్తూనే ఉన్నాం.

ఇక జనసేన కార్యకర్తలు మిగతా పార్టీ కార్యకర్తల్లా కాకుండా ప్రజలకు సాయం చేయడమే తమ అభిమాన నాయకుడికి ఇచ్చే అతి పెద్ద బహుమతి అని భావించి ఇలా ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇవ్వడాన్ని రాష్ట్రమంతా మెచ్చుకుంటున్నారు. జనసేన కనుక చిత్తశుద్ధితో ముందుకు వెళితే ప్రజల్లో వారికి మరింత మద్దతు లభించడం ఖాయం. ఇక ఇంత ‘జనసేవ’ చేస్తున్నా మీడియా పట్టించుకోవట్లేదు అంటే దాదాపు తెలుగు మీడియా మొత్తం ఆయా పార్టీల కి ఎప్పుడు అమ్ముడుపోయింది అని ప్రజలు అనుకుంటారు.

Also Read : ఆంధ్ర రాజకీయాలు కోర్టుల పాలు, ప్రజలు కష్టాలపాలు