https://oktelugu.com/

Janasena Guidelines: జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు

Janasena Guidelines: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు నిర్వహించనుంది. ఎంతో ఘనంగా నిర్వహించే ఈ సభ కోసం పార్టీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కార్యకర్తలు, నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించరాదని సూచించింది. హుందాతనానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటులేకుండా సామరస్య పూర్వకంగా మెలగాలని పేర్కొంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ పోస్టర్ విడుదల చేశారు. కార్యకర్తలు చేయాల్సిన పనుల గురించి వివరించారు. సభకు వచ్చే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 14, 2022 / 10:08 AM IST
    Follow us on

    Janasena Guidelines: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నేడు నిర్వహించనుంది. ఎంతో ఘనంగా నిర్వహించే ఈ సభ కోసం పార్టీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కార్యకర్తలు, నేతలు విచ్చలవిడిగా ప్రవర్తించరాదని సూచించింది. హుందాతనానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటులేకుండా సామరస్య పూర్వకంగా మెలగాలని పేర్కొంది. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ పోస్టర్ విడుదల చేశారు. కార్యకర్తలు చేయాల్సిన పనుల గురించి వివరించారు.

    Pawan Kalyan

    సభకు వచ్చే సమయంలో టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి గొడవలకు దిగకుండా వారితో సహకరించాల్సిందే. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సరైన క్రమంలో వాహనాలు నడుపుకుంటూ రావాలని చెబుతున్నారు.క్రమశిక్షణ చర్యలు పాటిస్తూ ఎవరికి కూడా సమస్యలు రాకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎంతటి వారైనా ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తగా మసలు కోవాల్సిందే. జనసేన కార్యకర్తల ప్రతిష్టను దెబ్బతీయకుండా మసలుకోవాల్సిందే.

    Also Read: ‘Janasena’ alliances: పొత్తులపై ‘జనసేన’ క్లియర్ కట్.. సస్పెన్స్ కు తెరదించే అవకాశం?

    మద్య నిషేధానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపకండి. రోడ్డు ప్రమాదాలను నివారించాలని పేర్కొన్నారు. సాటి వారికి సహకరించండి. అత్యంత వేగంతో వాహనాలు నడిపితే ఇతరులు భయాందోళనకు గురవుతారు అందుకే అతి వేగం వద్దు. పరిమిత వేగమే ముద్దు అన్న చందంగా సాధారణంగా వాహనాలను నడపాలని వివరించారు. ఎదుటి వారికి భయం కలిగించొద్దని చెబుతున్నారు.

    సభాస్థలిలో కూడా ప్రశాంతంగా ఉండండి. ఈలలు, గోలలు వద్దు. మౌనమే ముద్దు. ఎలాంటి అల్లర్లు చేయకుండా ఉంటేనే అందరికి మంచిది. వ్యక్తిగతంగా ఏదో చేద్దామని విచ్చలవిడిగా ప్రవర్తించొద్దని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండి సభ నిర్వహణకు సహకరించండి, చెట్లు, గోడలు, టవర్లు లాంటివి ఎక్కకండని జాగ్రత్తలు సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉంటూ ప్రమాదాల నివారణకు సహకరించండి అంటూ పవన్ కల్యాణ్ పోస్టర్ ద్వారా కార్యకర్తలను కోరారు. జనసేన సభను ప్రశాంతంగా నిర్వహించేలా చూడండి అంటూ వ్యాఖ్యానించారు. దీంతో సోమవారం నిర్వహించే సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    Also Read: Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్ ను పవన్ కళ్యాణ్ నిర్ధేశించబోతున్నారా?

    Tags