https://oktelugu.com/

Pawan Kalyan: దేనికైనా సత్తా ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే !

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సోషల్ మీడియా నిండా పవనిజమే కనిపిస్తోంది. పవర్ స్టార్ అనే నినాదాలతో చానెల్స్, వెబ్ సైట్స్ హోరెత్తుతున్నాయి. మరోపక్క పవన్ గురించి, పవన్ గొప్పతనం గురించి ఫ్యాన్స్ గొప్పగా చర్చ సాగిస్తున్నారు. నిజమే.. పవన్ స్వభావంలాగే, ఆయన పర్సనల్ లైఫ్, అలాగే ఆయన సినీ కెరీర్ అంతా ఓపెన్ బుకే. పవన్ మనసు స్వచ్ఛమైన వెన్న లాంటిది. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే.. వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 14, 2022 / 10:14 AM IST
    Follow us on

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఇప్పుడు సోషల్ మీడియా నిండా పవనిజమే కనిపిస్తోంది. పవర్ స్టార్ అనే నినాదాలతో చానెల్స్, వెబ్ సైట్స్ హోరెత్తుతున్నాయి. మరోపక్క పవన్ గురించి, పవన్ గొప్పతనం గురించి ఫ్యాన్స్ గొప్పగా చర్చ సాగిస్తున్నారు. నిజమే.. పవన్ స్వభావంలాగే, ఆయన పర్సనల్ లైఫ్, అలాగే ఆయన సినీ కెరీర్ అంతా ఓపెన్ బుకే. పవన్ మనసు స్వచ్ఛమైన వెన్న లాంటిది. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే.. వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. పవన్ వెంటనే వారికి సాయం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

    Pawan Kalyan

    అందుకే, పవన్ లోని సేవా గుణానికి పరిమితులు, పరిధులు లేవు. తిరుగులేని ఇమేజ్ వచ్చాక కూడా, పవన్ తన నైజాన్ని వదలక పోవడం నిజంగా విశేషమే. తోటి నటీనటులకు ఎంతో గౌరవం ఇవ్వడం, వారి వారి పొజిషన్ లతో సబందం లేకుండా అందర్నీ ఒకేలా చూడటం పవన్ లోని మరో గొప్పతనం. అయితే, పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు.. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న పవన్ పై బుసలు కొట్టే బురద పాములున్నాయి.

    ఇక, ఎదుటి వ్యక్తిలో తప్పు కనిపిస్తే పవన్ క్షమించరు, కానీ, ఖచ్చితత్వంతో ఉండే వ్యక్తులు అంటే పవన్ కు ఎంతో అభిమానం. ఏది ఏమైనా పవన్ ది విభిన్నమైన శైలి, పవన్ ప్రవర్తన వైవిధ్యమైన నైజం. అందుకే పవన్ ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడు. ఇక భీమ్లా నాయక్ తో తన పంజా రుచి చూపించాడు. ఈ సినిమా పవన్ అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది.

    Also Read: Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్ ను పవన్ కళ్యాణ్ నిర్ధేశించబోతున్నారా?

    పవన్ రేంజ్ ని, క్రేజ్ ని మరోసారి ఘనంగా గుర్తుకు చేసింది ఈ చిత్రం. ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభకు రంగం సిద్ధం అయ్యింది. ఈ సభకి చెందిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ కి ఉన్న ఫాలోయింగ్ మరో ఏ హీరోకి లేదు అని ట్రేడ్ వర్గాలు ఒక్కటై కోడై కూస్తున్నాయి. నిజానికి ఇప్పటికీ పవన్ కి సరైన సినిమా పడకపోయినా.. రికార్డ్స్ ను బ్రేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.

    పైగా పవన్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో వెళ్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటివరకూ రాజకీయాల్లో గెలుపోటములకు అతీతంగా పోరాటం చేస్తున్న ఏకైక హీరో కూడా ఒక్క పవన్ కల్యాణే. తనను గెలిపించకపోయినా ప్రజల మేలు కోసం పవన్ చేస్తున్న సేవలు, పోరాటాలు.. నేటి వరకూ ఎన్నికల్లో గెలిచి కూడా ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. అందుకే.. పవన్ పై సగటు మనిషి అభిమానాన్ని, నమ్మకాన్ని రెట్టింపు చేసుకునే క్షణం ఆసన్నమైంది.

    Also Read: Pawan Kalyan Sensational Statement: ఏపీ రాజకీయాలు శాసిస్తాం.. పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

    Tags