Janasena: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్ర్తంగా జనసేన డిజిటల్ యుద్ధం

Janasena:  విశాఖ స్టీల్ ప్లాంట్ ను జనసేన అస్ర్తంగా చేసుకుంటోంది. దీనిపై పోరాడేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాజకీయంగా తేల్చుకోవాలని బావిస్తోంది. దీనికి గాను వైసీపీని టార్గెట్ చేసుకుంటోంది. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నిస్తోంది. దీనికి ఈనెల 18 నుంచి 20 వరకు వైసీపీ, టీడీపీ ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎందుకు స్పందించడం లేదని అడుగుతోంది. పార్లమెంట్లో ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని పవన్ […]

Written By: Srinivas, Updated On : December 17, 2021 8:19 pm
Follow us on

Janasena:  విశాఖ స్టీల్ ప్లాంట్ ను జనసేన అస్ర్తంగా చేసుకుంటోంది. దీనిపై పోరాడేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాజకీయంగా తేల్చుకోవాలని బావిస్తోంది. దీనికి గాను వైసీపీని టార్గెట్ చేసుకుంటోంది. పార్లమెంట్ వేదికగా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నిస్తోంది. దీనికి ఈనెల 18 నుంచి 20 వరకు వైసీపీ, టీడీపీ ఎంపీలను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎందుకు స్పందించడం లేదని అడుగుతోంది.

Janasena Pawan Kalyan

పార్లమెంట్లో ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తున్నారు. 22 మంది ఎంపీలున్నా కేంద్రం వైఖరిని ఎందుకు అడగటం లేదని అనుమానిస్తున్నారు. ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీలు కనీసం ప్లకార్డులు కూడా ప్రదర్శించడం లేదు. విశాఖ స్టీల్ పై కనీసం సభనైనా స్తంభింపచేసే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దీంతో పవన్ కల్యాణ్ వారిపై కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై డిజిటల్ యుద్ధం చేసింది. రోడ్ల అధ్వాన స్థితిని ఎండగట్టేందుకు నిర్ణయించుకుని శ్రమదానం చేసి మరీ రోడ్లు బాగు చేసింది. అదే కోవలో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా తమదైన శైలిలో ముందుకు తెచ్చి దానిపై కూడా ఎంపీలు స్పందించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విశాఖ స్టీల్ అంశంలో కూడా డిజిటల్ యుద్ధం చేసేందుకు నిర్ణయించుకుంది.

Also Read: Nara Lokesh: ఇంకెప్పుడు నేర్చుకుంటావ్ ‘పప్పు’.. మీ తండ్రిని చూసైనా మారవా?

విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేన పోరాడేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పార్టీల్లో చలనం తీసుకొచ్చే విధంగా వారిని మార్చేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ గళం వినిపించేలా ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సూచిస్తోంది. ఎంపీలు స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యకు మార్గం కనుగొనాలని భావిస్తోంది.

Also Read: Jagan Sarkar: ఒక్క స‌ర్క్యుల‌ర్‌తో థియేట‌ర్ల ఓన‌ర్ల‌కు షాక్ ఇచ్చేసిన జ‌గ‌న్ స‌ర్కార్‌..!

Tags