Jayasudha: ఒకేసారి ఆ దిగ్గజ దర్శకులిద్దరూ ఆమె కోసం పోటీ పడేవారు !

Jayasudha: సహజమైన నటనకు జయసుధ బ్రాండ్ అంబాసిడర్. ఒక విధంగా ఒక తెలుగు నటికి నటనలో సహజత్వం ఉండాలనే నియమం ఆమె నుంచే బలపడింది. నిజానికి జయసుధ కంటే ముందు పేరు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా అప్పటి భానుమతి దగ్గర నుండి, ఇప్పటి సాయి పల్లవి వరకూ తమ హావభావాలతో ప్రేక్షకులను అలరించిన నటీమణులకు కొదవే లేదు. కానీ సహజ నటి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జయసుధ. నేడు ఆ సహజ […]

Written By: Shiva, Updated On : December 17, 2021 8:19 pm
Follow us on

Jayasudha: సహజమైన నటనకు జయసుధ బ్రాండ్ అంబాసిడర్. ఒక విధంగా ఒక తెలుగు నటికి నటనలో సహజత్వం ఉండాలనే నియమం ఆమె నుంచే బలపడింది. నిజానికి జయసుధ కంటే ముందు పేరు తెచ్చుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా అప్పటి భానుమతి దగ్గర నుండి, ఇప్పటి సాయి పల్లవి వరకూ తమ హావభావాలతో ప్రేక్షకులను అలరించిన నటీమణులకు కొదవే లేదు. కానీ సహజ నటి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు జయసుధ.

Jayasudha

నేడు ఆ సహజ నటీమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా జయసుధ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇక ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు .. ఆమె అసలు పేరు సుజాత. జయసుధ 1959 డిసెంబర్ 17న జన్మించింది. పుట్టి పెరిగింది మొత్తం మద్రాసులోనే. అయితే, ఆమె మాతృభాష మాత్రం తెలుగే. జయసుధ తల్లిగారిది గుంటూరు.

ఇక జయసుధ సినిమాల్లోకి రావడానికి కారణం.. నటి, నిర్మాత అయిన విజయనిర్మల జయసుధకు స్వయానా మేనత్త. ఆమె సాయంతోనే 1972 లో వచ్చిన పండంటి కాపురం సినిమాలో జయసుధ మొదటిసారి నటించింది. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు ఉన్నాయి. అలాగే 8 మలయాళ సినిమాలతో పాటు 3 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి.

జయసుధకు రాఘవేంద్రరావుతో ప్రత్యేక బంధం ఉంది. అందుకే, వారి కలయికలో సుమారు 25 సినిమాలు వచ్చాయి. అలాగే దాసరి నారాయణరావుకి కూడా జయసుధ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు వారి మధ్య సాన్నిహిత్యాన్ని సినీ ప్రముఖులు చెప్పారు. ఆ సాన్నిహిత్యానికి గుర్తుగా దాసరి – జయసుధ కలయికలో ఏకంగా 27 సినిమాలు వచ్చాయి. ఒకే సమయంలో ఈ ఇద్దరి దిగ్గజ దర్శకులు జయసుధ కోసం పోటీ పడేవారు.

Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ స్థాయి అవార్డు.. వస్తోందా ?

ఇక జయసుధ లవ్ లైఫ్ కి వస్తే.. 1985లో నితిన్ కపూర్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. జయసుధ మొదటి కుమారుడి పేరు నిహార్, రెండో కుమారుడి పేరు శ్రేయంత్. 2001లో జయసుధ క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. అలాగే 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. ప్రస్తుతం సినిమాల్లో మళ్ళీ బిజీ కావడానికి ఆమె కసరత్తులు చేస్తున్నారు.

Also Read: Anchor Vishnu priya: “పుష్ప” లోని సమంత పాటకు స్టెప్పులు ఇరగదీసిన… యాంకర్ విష్ణు ప్రియ

Tags