https://oktelugu.com/

Radhe Shyam: రాధే శ్యామ్ సినిమాలో ఆ సీక్రెట్ ని రివీల్ చేసిన… డైరెక్టర్ రాధా కృష్ణ

Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమాకి ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 06:53 PM IST
    Follow us on

    Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజా హెగ్డే నటించిన కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. ఈ సినిమాకి ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో వేచి చూస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.

    director radha krishna kumar reveals interesting details about radhe shyam movie

    Also Read: మోక్షజ్ఞ చేత భారీ యాక్షన్ చేయించబోతున్న బాలయ్య !

    ప్రభాస్‌ రాధే శ్యామ్‌ మూవీ నుంచి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇటీవల రాధే శ్యామ్‌లో ప్రభాస్‌ను పరిచయం చేస్తూ ఇటీవల రిలీజ్‌ చేసిన సంచారి పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్ రవిచందర్ పాడిన ఈ పాటలో క్లాస్‌లుక్‌తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేశాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు డైరెక్టర్ రాధాకృష్ణ రివీల్ చేసిన సీక్రెట్స్ ఈ మూవీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. రాధేశ్యామ్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల్లో ఆసక్తికి నెలకొంటుందని, ఈ మూవీ మొత్తం సర్‌ప్రైజ్‌లతో నిండిపోయిందన్నాడు. మొత్తంగా మంచు పర్వతంపై కూర్చొని సూర్యస్తమయాన్ని ఆస్వాదిస్తున్నట్టు రాధేశ్యామ్ ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాడు. ఇందులో హీరోహీరోయిన్లు విక్రమాదిత్య – ప్రేరణల రొమాన్స్ మాత్రమే కాదు. కథను లైఫ్ అండ్ డెత్ మధ్య సెలెబ్రేషన్‌గా చూపించబోతున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. జీవితానికి, చావుకు మధ్య పార్టీ జరిగితే ఎలా ఉంటుందన్న ఎమోషన్స్ ఇందులో క్యారీ చేశాడు. జాతకాలను నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లకి మధ్య ప్రేమను తీసుకొస్తే ఎలా ఉంటుందనేది రాధాకృష్ణ బేసిక్ ఆలోచన.

    Also Read: “పుష్ప” లోని సమంత పాటకు స్టెప్పులు ఇరగదీసిన… యాంకర్ విష్ణు ప్రియ