https://oktelugu.com/

Pawan kalyan: పవన్ కు లెక్కుంది.. అదే రేపు ఏపీలో కిక్కుస్తుందట..!

Pawan kalyan In AP Politics: పవన్ కు తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని సినిమా డైలాగ్ ఉంది. కానీ ఏపీ రాజకీయాల విషయంలో పవన్ కు నిజంగానే ఓ లెక్కుంది.. అదే రేపులో ఏపీలో కిక్కు ఇచ్చేలా ఉందట.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే తన టార్గెట్ ఐదో పదేళ్లు కాదు.. పాతికేళ్లు అన్నాడు. ఇప్పటికీ నడివయసు కంటే తక్కువే కావడం.. యువకుడే కావడంతో పెద్దగా రాజ్యాధికారం కోసం పవన్ తొందరపడాల్సిన పని లేదు. అందుకే ఏపీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2021 5:18 pm
    Follow us on

    Pawan kalyan In AP Politics: పవన్ కు తిక్కుంది.. దానికో లెక్కుంది’ అని సినిమా డైలాగ్ ఉంది. కానీ ఏపీ రాజకీయాల విషయంలో పవన్ కు నిజంగానే ఓ లెక్కుంది.. అదే రేపులో ఏపీలో కిక్కు ఇచ్చేలా ఉందట.. పవన్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే తన టార్గెట్ ఐదో పదేళ్లు కాదు.. పాతికేళ్లు అన్నాడు. ఇప్పటికీ నడివయసు కంటే తక్కువే కావడం.. యువకుడే కావడంతో పెద్దగా రాజ్యాధికారం కోసం పవన్ తొందరపడాల్సిన పని లేదు. అందుకే ఏపీలో బలమైన ప్రతిపక్షాలపై వ్యతిరేకత వచ్చే వరకూ.. అవి అంతరించిపోయే వరకూ ఆగి వెయిట్ చేసి బలపడి ఏపీలో రాజ్యాధికారం సాధించాలని మాస్టర్ ప్లాన్ వేశాడట పవన్.

    Pawan kalyan

    Chandrababu-Jagan-Pawan-are

    జనసేనను మరింత బలోపేతం చేసేందుకు పవన్ యోచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా జనం తనవైపు చూస్తారన్న భరోసా పవన్ లో ఉంది.టీడీపీ తనకు ప్రధాన శత్రువు కాదని పవన్ భావిస్తున్నాడు. టీడీపీ దానంతట అదే అంతరించిపోతుందన్న లెక్కల్లో పవన్ ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

    ఒకవేళ 2024 ఎన్నికల్లో కనుక వైసీపీ, టీడీపీకి మెజార్టీ రాకుండా మ్యాజిక్ ఫిగర్ ఇబ్బందులు ఎదురుతై మాత్రం పవన్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలో కుమారస్వామి సీఎం అయినట్టే పవన్ సైతం ఏపీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదన్న అంచనాలో జనసేన వర్గాలు ఉన్నాయి. టీడీపీ తనకు మద్దతిచ్చి ఖచ్చితంగా సీఎంను చేస్తుందన్న అంచనాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు.

    పవన్ కళ్యాణ్ పక్కా లెక్కలతో ముందుకెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. లేకపోవడం మాట అంటుంచితే.. భవిష్యత్ జనసేనదేనని గట్టిగా నమ్ముతున్నారు.

    ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు నామమాత్రం. వాటి ప్రభావం ఎన్నికల్లో పెద్దగా ఉండదు. అయితే వైసీపీ అధినేత జగన్ యువకుడిగా బలంగా ఉన్నారు. చంద్రబాబు వయసు అయిపోయింది. సో ఏకైక ఆప్షన్ యువకుడైన పవన్ కళ్యాణ్ యే. అందుకే పవన్ భవిష్యత్ పాలిటిక్స్ పై నమ్మకంగా ఉన్నారు.

    Also Read: ఏపీకి ప్రత్యేక హోదా.. పుట్టుకొచ్చిన కొత్త ఆశ!

    ప్రస్తుతం ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. మరో దఫా గెలవవచ్చు. ఓడొచ్చు. ఏదైనా జరగవచ్చు. జనాల్లో అసంతృప్తి రావడం సహజమే. అయితే దీనికి ప్రత్యామ్మాయంగా టీడీపీ ఎదగడం లేదని పవన్ కళ్యాణ్ బలంగా విశ్వసిస్తున్నారు. ఇటీవల జగన్ ఆగడాలు తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడంతో నాయకత్వంపై టీడీపీ శ్రేణుల్లోనే నమ్మకం పోయింది. అలాగే టీడీపీకి భవిష్యత్ నాయకుడంటూ ఎవరూ లేరు. లోకేష్ ఇప్పటికే తేలిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఉన్నంత వరకూ రాజకీయాల్లోకి రారు. మరో దశాబ్ధకాలం పట్టొచ్చు. సో ఇప్పుడు పవన్ కు ఇది రాజకీయాల్లో ఎదగడానికి.. బలంగా నిలవడానికి సువర్ణ అవకాశం. ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్మాయంగా పవన్ కళ్యాణ్ నిలబడుతారని భావిస్తున్నారు.

    రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎవరి గాలి వీస్తుందో చెప్పలేం. మూడ్ ఆఫ్ ది స్టేట్ ను బట్టి అధికారం చేతులు మారుతుంటుంది. ఏపీలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులను చూస్తే తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోలేదని అర్థమవుతోంది. చంద్రబాబు కన్నీళ్లతో క్యాడర్ లో అస్సలు జోష్ లేదు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బిందాస్ గా ఉన్నారు. భవిష్యత్ రాజకీయం తనదేనని భరోసాగా ఉన్నారు.

    Also Read: పాలించే రాజుకు ఈ గుణం ఉంటే ఆ రాజ్యం సర్వనాశనమే..?