https://oktelugu.com/

Naga Chaitanya: సమంతతో చైతన్య విడిపోడానికి కారణం ఇదేనా?.. వైరల్​గా చై రీసెంట్ ఇంటర్వ్యూ

Naga Chaitanya: నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటించి చాలా కాలమైనా ఇప్పటికీ ఆ టాపిక్​ గురించి గుసగుసలు రావడం ఆగట్లేదు. అసలు వీరు విడిపోడానికి కారణం ఏమైఉంటుందా అని ఇరు అభిమానులు తలలు బాదుకుంటున్నారు. ఏదో ఒక క్లారిటీ వస్తే ఈ గాసిప్స్ ఆగిపోతాయ్ కదా అని అందరీ ఇంటెన్షన్​.. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు టాలీవుడ్​లో కొత్త చర్చకు దారితీశాయి. విభిన్న పాత్రల్లో నటించే అంశంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..  తమ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 17, 2021 / 11:32 AM IST
    Follow us on

    Naga Chaitanya: నాగచైతన్య, సమంత విడాకులు ప్రకటించి చాలా కాలమైనా ఇప్పటికీ ఆ టాపిక్​ గురించి గుసగుసలు రావడం ఆగట్లేదు. అసలు వీరు విడిపోడానికి కారణం ఏమైఉంటుందా అని ఇరు అభిమానులు తలలు బాదుకుంటున్నారు. ఏదో ఒక క్లారిటీ వస్తే ఈ గాసిప్స్ ఆగిపోతాయ్ కదా అని అందరీ ఇంటెన్షన్​.. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు టాలీవుడ్​లో కొత్త చర్చకు దారితీశాయి.

    Naga Chaitanya

    విభిన్న పాత్రల్లో నటించే అంశంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..  తమ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే పాత్రలు చేయడానికి తాను ఇష్టపడనని తెలిపాడు చైతూ. నేను అన్ని రకాల పాత్రలు చేస్తా. కానీ, నా ఫ్యామిలీ, మా ప్రతిష్టపై అవి ప్రభావం చూపకూడదు. వాళ్లకు ఇబ్బంది కలిగించేదేది నేను చేయను. అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సామ్​ను ఉద్దేశించే చై ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట్లో చర్చ నడుస్తోంది.

    Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఊ అంటావా సాంగ్ మేల్ వెర్షన్…

    సామ్ ఇటీవల కాలంలో బోల్డ్​గా కనిపిస్తూ.. మరింత గ్లామరస్​గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సినిమా పరంగా సమంత తీసుకునే నిర్ణయాలను అక్కినేని ఫ్యామిలి ప్రోత్సహించకోవడంతోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చై వ్యాఖ్యలతో వాటికి మరింత బలం చేకూరినట్లైంది. వాళ్లు విడిపోయే ముందు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్2 వచ్చింది. అందులో సామ్ తన పాత్ర గురించి కుటుంబ సభ్యులతో చెప్పలేదని.. దీంతో విషయం విడాకుల దాకా వెళ్లిందని సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రచారం నడుస్తోంది. కాగా, సామ్ ఈ సిరీస్​లో కాస్త రొమాన్స్​కు ఓవర్​డోస్​ ఇచ్చిన సంగతి తెలిసిందే.

    అయితే, వీరిద్దరు విడిపోయిన తర్వాత వరుసగా ప్రాజెక్టులకు సైన్​ చేస్తూ.. కెరీర్​లో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య లాల్​సింగ్​ చద్దాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అమీర్​ఖాన్​హీరోగా కనిపించనున్నారు. మరోవైపు సామ్ శాకుంతలంతో పాటు పుష్పలో ఐటెం సాంగ్​లో చేసింది. దీంతో పాటు ఓ హాలీవుడ్​ ఫిల్మ్​లోనూ నటిస్తోంది.

    Also Read: ‘పుష్ప’కు అక్కడ మైనస్.. ఇక్కడ ప్లస్?