Nayanthara: నయనతార దంపతులు సరోగసీ చట్టాన్ని అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. పెళ్ళైన నాలుగు నెలల వ్యవధిలో తల్లిదండ్రులమయ్యామని ప్రకటించి చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరూ నేరం చేసినట్లు రుజువైతే జైలుపాలు కావడం తప్పదు. అసలు 2021 సరోగసీ చట్టంలో ఏముందో చూద్దాం… పెళ్ళైన దంపతులు, విడాకులు తీసుకున్న లేదంటే భర్త మరణంతో ఒంటరైన మహిళలు సరోగసీని ఆశ్రయించవచ్చు. పెళ్ళైన దంపతులకు చట్టం అవకాశం ఇచ్చింది.

అయితే కొన్ని పరిమితులు ఉన్నాయి. దంపతులకు ఆరోగ్య సమస్యలు ఉన్న పక్షంలో డాక్టర్స్ అనుమతి పత్రం తో సరోగసీ పద్దతిలో తల్లిదండ్రులు కావచ్చు.ఆల్రెడీ పిల్లలున్న, దత్తత తీసుకున్న పేరెంట్స్ కి అవకాశం లేదు.అలాగే పిల్లల్ని కనడానికి పూర్తి ఆరోగ్యం ఉన్న దంపతులు సరొగసీ పద్దతిలో పిల్లల్ని కనకూడదు. కాబట్టి సరోగసీ చట్టం ప్రకారం నయనతార-విగ్నేష్ ప్రాధమికంగా రెండు నిబంధనలు ఉల్లంఘించారు. మొదటిది పెళ్లి కాకుండానే సరోగసీ ప్లాన్ చేశారు. అంటే వివాహానికి ఐదు నెలల ముందు అద్దెగర్భంలో తమ అండం విడుదల చేశారు.
అలాగే నయనతార, విగ్నేష్ పిల్లల్ని కనడానికి అనువైన ఆరోగ్యం కలిగి ఉన్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. సంతానోత్తి సామర్థ్యం కలిగి ఉండి సరోగసీకి పాల్పడితే అదొక నేరం అవుతుంది. నయనతార,విగ్నేష్ ఆరోగ్య సమస్యలు పక్కనపెడితే… పెళ్లి కాకుండా సరోగసీకి పాల్పడి నేరం చేశారు. అయితే తాము తల్లిదండ్రులు అయినట్లు ప్రకటించిన విగ్నేష్-నయనతార సరోగసీనే కారణమని వెల్లడించలేదు. ఒకవేళ అద్దె గర్భంతో తల్లిదండ్రులు అయ్యారని రుజువైతే రూ. 50 వేల జరిమానా, 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి.

నయనతార దంపతులు ఆ కవల పిల్లలను దత్తత తీసుకున్న క్రమంలో వారు నేరానికి పాల్పడినట్లు కాదు. ఇప్పటికే వారు న్యాయనిపుణులను ఆశ్రయించారట. సరోగసీ చట్టంపై అవగాహన లేకపోవడంతో నయనతార-విగ్నేష్ చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తుంది. తమిళనాడు ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఆదేశించింది. అలాగే పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు.