Jammu And Kashmir: ఇలాంటి దుస్థితిలో కనీసం బయటికి వెళ్లడానికే భయం కలుగుతుంటే.. పాఠశాలలకు పిల్లలు ఎలా వెళ్తారు.. ఒకవేళ వెళ్లినా వారు ఇంటికి తిరిగి ఎలా వస్తారు.. అందువల్లే కాశ్మీర్లో విద్యాసంస్థలు నిరవధికంగా మూతపడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడం లేదు. దీంతో విద్యార్థులు ఆటపాటలతో కాలం గడిపేస్తున్నారు. అయితే పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిత్యం ఆర్మీ సంచారంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు బార్డర్లో టెర్రరిస్టులు ఫైరింగ్ చేయడం.. మిసైల్స్ సంధించడంతో పరిస్థితి ఒక్కసారిగా కట్టు తప్పింది. ఈ క్రమంలో అక్కడ విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఉపాధి లభించకపోవడంతో పెద్దలు ఇంటి వద్ద ఉంటున్నారు. వాస్తవానికి అన్ని బాగుంటాయి పర్యాటకులతో కాశ్మీర్ ప్రాంతం కిటకిటలాడేది. నీతో స్థానికంగా ఉండే వారికి ఉపాధి లభించేది. కానీ పహల్గాం ఘటన తర్వాత అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
Also Read: విదేశీ ప్లేయర్లు రావడం లేదు.. ఐపీఎల్ రీ స్టార్ట్ అవుతుందా? లేదా?
కాశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కాశ్మీర్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బార్డర్ విలేజెస్ ఆయన కుప్వారా, బారాముల్లా, బండి పోర జిల్లాలోని గురుజి సబ్ డివిజన్ మినహా కాశ్మీర్ మొత్తంలో పాఠశాలలను మంగళవారం నుంచి ప్రారంభించింది. రెండు దేశాల మధ్య ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఇటీవల స్కూళ్లను ముందు జాగ్రత్తగానే మూసేసేవారు.. అయితే ఇప్పుడు సైన్యం ఇచ్చిన భరోసాతో పాఠశాలలను మంగళవారం నుంచి రీఓపెన్ చేశారు. పంజాబ్ లోని సంగ్రూర్.. ఇతర ఐదు బార్డర్ డిస్ట్రిక్ట్ లలో స్కూళ్ళు మూసి ఉన్నాయి.. అయితే పటాన్ కోట్, అమృత్ సర్, ఫిరోజ్పూర్, గురుదాస్పూర్, తరన్ తరన్ జిల్లాలలో మాత్రం స్కూల్స్ మూసే ఉంటాయి. అయితే పాకిస్తాన్ దేశంతో పంజాబ్ రాష్ట్రానికి 553 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది.. పహల్గాం దాడి తర్వాత.. భారత్ ఏకంగా పాకిస్తాన్ లోని టెర్రరిస్టులపై అటాక్ చేసింది. టెర్రరిస్ట్ క్యాంపులను కూల్చి పడేసింది. కనివిని ఎరుగని స్థాయిలో దాడులు చేసి ఉగ్రవాద దేశానికి చుక్కలు చూపించింది. అందువల్లే దాయాది కాళ్ల బేరానికి వచ్చింది. శరణు అటు అమెరికాతో వర్తమానం పంపింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భారత్ ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. మాట తప్పిన దిక్కుమాలిన ఉగ్రవాద దేశం బార్డర్లో ఫైరింగ్ చేస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఇండియన్ ఆర్మీ బదులు ఇస్తూనే ఉంది. ఏకంగా పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్.. ఇతర కీలక ప్రాంతాలను భారత్ టార్గెట్ చేయడంతో.. నిన్నటి నుంచి బార్డర్లో ఫైరింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే ఉగ్రవాద దేశాన్ని ఏమాత్రం నమ్మని భారత్.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూనే ఉంది. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆర్మీ… ఈసారి ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా సమర్థవంతంగా పని చేస్తోంది.