Shankar : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శంకర్ (Shakar)…ఇండస్ట్రీలో ఆయనకు గొప్ప గుర్తింపు అయితే ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలేవి సరిగ్గా ఆడక పోవడంతో భారీ డిజాస్టర్ లను మూటగట్టుకుంటున్నాడు. దాంతో ఆయన మార్కెట్ భారీగా కోల్పోయాడనే చెప్పాలి. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి డిజాస్టర్ ని ముట్టుగట్టుకోవడంతో అతనికి సినిమాలను ఇచ్చే హీరోలు కరువయ్యారనే చెప్పాలి. ఇక ‘భారతీయుడు 2’ (Bharatheeyudu) సినిమా అయితే అల్ట్రా డిజాస్టర్ గా మిగిలింది. ఇక దానికి సీక్వల్ గా ‘భారతీయుడు 3’ సినిమాని కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయుడు 2 సినిమా ప్రొడ్యూసర్స్ విపరీతంగా నష్టపోవడంతో భారతీయుడు 3 సినిమాని కూడా చేసి పెడితే దాన్ని ఓటిటిలో రిలీజ్ చేసినా కూడా వాళ్ళ నష్టాలు కొంతమేరకు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో వాళ్లు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ఆ ఇద్దరు తమిళ స్టార్ డైరెక్టర్లు చతికలపడ్డారా..?
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ప్లానింగ్ చేసి సక్సెస్ ని సాధించి మరోసారి శంకర్ ఇస్ బ్యాక్ అని తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ సైతం మణిరత్నంతో చేస్తున్న ‘థగ్ లైఫ్’ (Thug Life) అనే సినిమా కోసమే తన డేట్స్ మొత్తాన్ని కేటాయించాడు. మరి భారతీయుడు 3 సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.
సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే కోణంలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోగలిగితేనే ఆయన ఇండస్ట్రీలో మరికొంత కాలం పాటు కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు.
ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు వరుసగా సూపర్ సక్సెస్ లను సాధించాయి. స్టార్ హీరోలు సైతం అతనితో సినిమా చేయాలి అని కుతూహలంతో ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది. దాంతో స్టార్ హీరోలు చక మంది తనతో సన్నిహితంగా ఉన్నప్పటికి అతనికి ఏ హీరో నుంచి కూడా పిలుపు రాకపోవడంతో ఆయన భారతీయుడు 3 సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత తన తదుపరి ప్లానింగ్స్ ని బయటపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ‘సికిందర్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..సల్మాన్ కి ఇంత తక్కువనా?