https://oktelugu.com/

టీపీసీసీ రేసులో జగ్గారెడ్డి.. జీహెచ్ఎంసీ ఫలితాలపై సంచలన కామెంట్స్!

గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఈ పదవీ కోసం కాంగ్రెసులోని సీనియర్ నేతలంతా పోటీపడుతున్నారు. తాజాగా పీసీసీ రేసులో తాను కూడా ఉన్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది. Also Read: ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం! గతంలోనూ ఆయన పలుమార్లు టీపీసీసీ పదవీ తనకు ఇవ్వాలని.. లేనట్లయితే కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే ఇవ్వాలంటూ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 6, 2020 12:52 pm
    Follow us on

    Jagga Reddy

    గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమారెడ్డి తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ఈ పదవీ కోసం కాంగ్రెసులోని సీనియర్ నేతలంతా పోటీపడుతున్నారు. తాజాగా పీసీసీ రేసులో తాను కూడా ఉన్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.

    Also Read: ఎంఐఎంతో పొత్తుపై కేసీఆర్ వ్యూహాత్మక మౌనం!

    గతంలోనూ ఆయన పలుమార్లు టీపీసీసీ పదవీ తనకు ఇవ్వాలని.. లేనట్లయితే కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇస్తే వ్యతిరేకిస్తానని బహిరంగంగానే జగ్గారెడ్డి పలుమార్లు మీడియాముఖంగా ప్రకటించాడు.

    శనివారం గ్రేటర్ ఫలితాలపై జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడినా.. నైతికంగా గెలించిందన్నారు. బీజేపీ.. ఎంఐఎంలు మత రాజకీయం చేసి సీట్లను పెంచుకున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు.

    Also Read: కాంగ్రెస్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన ‘కొండా’..!

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని చూసి ఓటేయలేదని.. ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని చూసి ఓటేశారంటూ సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపొటములను ఎప్పుడూ సమానంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు.

    టీపీసీసీ రేసులో ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందంజలో ఉండగా ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు విన్పిస్తోంది. తాజాగా పీసీసీ రేసులో తాను కూడా ఉన్నట్లు జగ్గారెడ్డి స్పష్టం చేయడం ఆసక్తిని రేపుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్