భార్యపై కోపంతో 400 కిలోమీటర్లు నడిచిన భర్త.. చివరకు..?

సాధారణంగా భార్యాభర్తలన్న తరువాత ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. వంటల విషయంలో, టీవీ ఛానెల్ విషయంలో, వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కోపం వస్తే భార్య లేదా భర్త తిండి తినడం మానేస్తూ అలక ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఒక భర్త మాత్రం భార్య మీద కోపంతో ఏకంగా 418 కిలోమీటర్లు నడుచుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఇటలీలోని కోమో ప్రాంతంలో […]

Written By: Navya, Updated On : December 5, 2020 8:35 pm
Follow us on

సాధారణంగా భార్యాభర్తలన్న తరువాత ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. వంటల విషయంలో, టీవీ ఛానెల్ విషయంలో, వస్తువులు కొనుగోలు చేసే విషయంలో ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కోపం వస్తే భార్య లేదా భర్త తిండి తినడం మానేస్తూ అలక ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఒక భర్త మాత్రం భార్య మీద కోపంతో ఏకంగా 418 కిలోమీటర్లు నడుచుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటలీలోని కోమో ప్రాంతంలో భార్యాభర్తలు కలిసి ఉండేవారు. ప్రతిరోజూ ఏదో ఒక విషయంలో వాళ్లిద్దరికి గొడవ జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు మాత్రం రోజూ జరిగే గొడవ కన్నా పెద్ద గొడవ జరిగింది. భార్య భర్తను, భర్త భార్యను దారుణంగా తిట్లు తిట్టుకున్నారు. కోపం ఎక్కువైన భార్య భర్తను గట్టిగా ఒక దెబ్బ కొట్టింది. భార్య కొట్టడంతో అవమానంగా ఫీలైన భర్త ఏం చేయాలో పాలుపోక ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

భర్తపై కోపంగా ఉన్న భార్య భర్త ఇంటి నుంచి వెళ్లిపోతున్నా పట్టించుకోలేదు. ఇంటి నుంచి బయటకు వెళుతున్న భర్త కోపంతో అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 418 కిలోమీటర్ల దూరం వెళ్లాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా స్వయంగా ఇటలీ పోలీసులు ఈ విషయాలను మీడియాకు వెల్లడించడంతో నమ్మాల్సి వస్తోంది. ఇటలీలోని గిమర్రా పట్టణంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు అతనిని ఆపారు.

అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతను చెప్పిన మాటలు విని అవాక్కయ్యారు. పోలీసులు ఆ వ్యక్తి సొంతూరులోని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయగా అతని గురించి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయినట్టు అక్కడి పోలీసులు చెప్పారు. అంత దూరం నడిచిన అతని వయస్సు 48 సంవత్సరాలు కాగా కోపంతోనే తాను నడిచానని.. దారిలో కొంతమంది తనకు తిండి పెట్టి ఆకలి తీర్చారని ఆ వ్యక్తి వెల్లడించాడు.