YSRCP- Central Government: కేంద్రంతో పోరాడుతున్నట్టు వైసీపీ బిల్డప్ ఇస్తోందా? లేకుంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోందా? ఇప్పుడిదే పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్నాళ్లూ తాము ఎంతో అణుకువుగా ఉన్నాకేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవహరిస్తున్న తీరును సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు.కేంద్రం సహకరించడం లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.నిర్వాసితుల కష్టాలకు మోదీ తీరే కారణమంటూ స్వయంగా జగన్ డిక్లేర్ చేసేశారు. ఇప్పటివరకూ పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చిన జగన్ ఇప్పుడిప్పుడే తన మనుసలోని మాటను బయటపెడుతున్నారు. అయితే ఎప్పుడూ బీజేపీ కేంద్ర పెద్దల భజన చేసే విజయసాయిరెడ్డి సైతం పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శల డోసు పెంచుతున్నారు.
కేంద్రం తప్పుపట్టడంతో…
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అప్పులపై సమీక్షించిన కేంద్రం ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టింది. వైసీపీ సర్కారు ఆర్థిక క్రమశిక్షణను కట్టుదాటుతోందని.. నియంత్రణ అవసరమని పేర్కొంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో, గణాంకాలతో సహా ఏపీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. సహజంగా ఇది వైసీపీకి మింగుడుపడని విషయం. దీంతో వైసీపీ ఎంపీలు రంగంలోకి దిగారు. హస్తినాలోనే విలేఖర్ల సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. రాష్ట్రాలను ప్రశ్నిస్తున్నప్పుడు.. కేంద్రం చేస్తున్న అప్పుల మాటేమిటని నిలదీస్తున్నారు. విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందుకేసి కేంద్రం రాష్ట్రాలను నిర్లక్షం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల ఆదాయాన్ని కొల్లగొడుతోందని సైతం ఆక్షేపించారు. అంతటితో ఆగకుండా బీసీల పేరుతో కేంద్రంతో పాటు న్యాయవ్యవస్థపై సైతం వైసీపీ విమర్శలు ప్రారంభించింది. ఢిల్లీలో వైసీపీ బీసీ ఎంపీలు విలేఖర్ల సమావేశం పేరిట తెగ హడావుడి చేశారు.
Also Read: Jagananna Thodu: జగనన్న ‘తోడు’ నీడనిస్తుందా?
హస్తినాలో ఇదే హాట్ టాపిక్…
అయితే బీజేపీ విషయంలో సడన్ గా వైసీపీ రూటు మార్చుకోవడం ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేస్తుండడం ఢిల్లీ వర్గాల్లో సైతం కలకం రేపుతున్నాయి. బీజేపీకి దూరమయ్యేందుకో… లేకుంటే ఆ పార్టీతో పోరాడుతున్నామని చెప్పుకోవడానికో కానీ..వైసీపీ గ్రౌండ్ స్థాయిలో అన్నీ ప్రిపేర్ చేసుకుంటుందన్న ప్రచారం అయితే సాగుతోంది. అవసరమైతే కేంద్రంతో యుద్ధం చేస్తామని కూడా జగన్ ప్రకటించారు. అయితే అందుకు తగ్గ పరిస్థితులైతే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి.అటు బీజేపీ వ్యూహకర్తలకు సైతం వైసీపీ పట్ల ఓ క్లారిటీ ఉంది.బీజేపీని దూరంగా జరుగుతున్నారని మాత్రం వారు భావిస్తున్నారు.అయితే ముందుగా బీజేపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. కుదరకపోతే అవే సాకుగా చూపి బయటకు వెళ్లిపోయేందుకు వైసీపీ నేతలు దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
పక్కా వ్యూహంతోనే…
అయితే బీజేపీని దూరం చేసుకుంటే వచ్చే నష్టం వైసీపీకి, జగన్ కు తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఇప్పటివరకూ తమతో సఖ్యతగా ఉన్న బీజేపీ కొత్తగా టీడీపీ బాట పట్టడం జగన్ కు రుచించడం లేదు. వ్యూహాత్మకంగా చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ పెద్దలపై అనుమానం పెంచుకున్నారు. అల్లూరి విగ్రహావిష్కరణ, రాష్ట్రపతి అభ్యర్థితో పాటు బీజేపీ నేతలు చంద్రబాబును కలవడం, స్వాతంత్ర దినోత్సవ సన్నాహాక వేడుకలకు చంద్రబాబును ఆహ్వానించడం, టీడీపీపై విమర్శల జడివాన తగ్గడం తదితర కారణాలతో జగన్ లో ఒక రకమైన అసహనం ప్రారంభమైంది. బీజేపీని దూరం చేసేలా ఆలోచన వచ్చింది. అవసరమైతే పొరుగున ఉన్న మిత్రుడు కేసీఆర్ బాటలో నడవడానికి జగన్ వెనుకాడరని పొలిటికల్ వర్గాల్లో అయితే ప్రచారం నడుస్తోంది.
Also Read:Congress- Munugode by-Election: మునుగోడు.. కాంగ్రెస్ ను ముంచుతుందా? తేల్చుతుందా?