https://oktelugu.com/

బాలయ్య ఫ్యాన్స్ కు ఇది ఇబ్బందే !

నందమూరి బాలకృష్ణకు మొదటి నుండి కథల విషయంలో డైరెక్టర్ ల విషయంలో జడ్జ్ మెంట్ లేదనేది ఇండస్ట్రీలో తరుచూ వినిపించే మాట. సరైన కథలను ఎలాగూ బాలయ్య పట్టుకొడు, ఇక డైరెక్టర్ లను కూడా సరైన వాళ్లను పెట్టుకోకపోతే ఎలా అనేది ఆయన ఫ్యాన్స్ ఆవేదన, వారి బాధలో కూడా అర్ధం ఉంది. ఒకప్పుడు బాలయ్య మార్కెట్ రేంజ్ టాలీవుడ్ లో సెకెండ్ ప్లేస్ లో ఉండేది. ఫస్ట్ ప్లేస్ లో మెగాస్టార్ ది. మరి ఇప్పుడు […]

Written By:
  • admin
  • , Updated On : July 16, 2020 / 09:07 PM IST
    Follow us on


    నందమూరి బాలకృష్ణకు మొదటి నుండి కథల విషయంలో డైరెక్టర్ ల విషయంలో జడ్జ్ మెంట్ లేదనేది ఇండస్ట్రీలో తరుచూ వినిపించే మాట. సరైన కథలను ఎలాగూ బాలయ్య పట్టుకొడు, ఇక డైరెక్టర్ లను కూడా సరైన వాళ్లను పెట్టుకోకపోతే ఎలా అనేది ఆయన ఫ్యాన్స్ ఆవేదన, వారి బాధలో కూడా అర్ధం ఉంది. ఒకప్పుడు బాలయ్య మార్కెట్ రేంజ్ టాలీవుడ్ లో సెకెండ్ ప్లేస్ లో ఉండేది. ఫస్ట్ ప్లేస్ లో మెగాస్టార్ ది. మరి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో మెగాస్టారే.. బాలయ్య పరిస్థితి ఏమిటి ? కనీసం టాప్ ఫైవ్ ప్లేస్ ల్లో అన్న బాలయ్య మార్కెట్ రేంజ్ ఉందా .. లేదు. నిజానికీ నాని లాంటి ఎవరేజ్ హీరో అంత మార్కెట్ కూడా బాలయ్యకు లేదంటే.. అదీ ఖచ్చితంగా బాలయ్యకు అవమానమే.

    ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. బాలయ్య సినిమా మార్కెట్ అనేది.. ఆయన కలిసి పని చేసే డైరెక్టర్ ను బట్టి కూడా ఉంటుంది. స్టార్ డైరెక్టర్ అయితే, ఓ రేంజ్ మార్కెట్, ఫామ్ లో లేని డైరెక్టర్ అయితే కొత్త హీరో సినిమా మాదిరి ఉంటుంది బాలయ్య సినిమా పరిస్థితి. ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి తెలుసు.. కానీ బాలయ్యకు తెలియదా.. ఏమిటో ఈ బాలయ్య కనీసం తన మార్కెట్ పరిధిని పెంచుకునే ప్రయత్నమే చెయ్యడయ్యే. బాలయ్య కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ సినిమాలు ముఖ్యమైనవే.. ఈ సినిమాలతోనే బాలయ్యకు మంచి క్రేజ్ వచ్చింది, నిజమే. అంతమాత్రాన మళ్ళీ అలాంటి సినిమానే తీస్తే జనం చూస్తారా.. అలాంటిదే కదా మళ్ళీ అదే డైరెక్టర్ తో సినిమా చేయడం అంటే.

    చిరు రేంజ్‌కు రెహమాన్‌ సరిపోతాడా?

    ఇంతకీ ఆ డైరెక్టరే బి.గోపాల్. బాలయ్యది, ఆయనది సూపర్ హిట్ కాంబినేషనే.. కాదనలేం. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా.. నిజానికి గోపాల్ కూడా బాలయ్యను ఇదే మాట అడిగాడట. కానీ బాలయ్య మాత్రం నేను ఫిక్స్ చేస్తే.. ఎవ్వడు కాదంటాడు..? అని తన శైలిలో ఓ డైలాగ్ వేశాడట. ఎవ్వడు కాదంటాడు.. బాలయ్య ఫిక్స్ చేశాక.. ఇక అదే ఫైనల్. అయితే ఇలా ఫిక్స్ లు చేసే.. పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేక బాలయ్య సినిమాలు చేతులు ఎత్తేస్తున్నాయి. గోపాల్ ఎప్పుడో సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయాడనేది ఆయనకే తెలుసు.. కానీ ఆ విషయం బాలయ్యకు తెలియకపోవడం.. బాలయ్య ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టేదే. ఎనీ వే.. బాలయ్య మాత్రం మరోసారి బి.గోపాల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కథను ఫిక్స్ చేసాడట. క్యాన్సల్ అయిందనుకున్నా సినిమా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది.