Jagan Underestimated Pawan Kalyan: గత ఎన్నికల్లో అంతులేని విజయం సాధించిన తరువాత జగన్ పొలిటికల్ బిల్డప్ లో ఉన్నారు. రాజకీయంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ వస్తున్నారు. అన్నింటా సక్సెస్ కనిపించడంతో ఇక తనకు తిరుగులేదన్న దీమాకు వచ్చేశారు. అందుకే పవన్ ను ఒక నాయకుడిగా కూడా అంగీకరించే పరిస్థితిలో లేరు.అయితే ఇదంతా మొన్నటి విశాఖ ఎపిసోడ్ వరకూ. తనను కానీ.. జనసేనను కానీ టచ్ చేస్తే పొలిటికల్ సిట్యువేషన్ ను మార్చేస్తానని కూడా పవన్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ లోకి దిగారు. వైసీపీపై యుద్ధం ప్రకటించారు. నేరుగా రండి అంటూ సవాల్ చేశారు. అటు తరువాత ఏపీలో మిగతా పార్టీల నాయకులు పవన్ వద్దకు క్యూకట్టారు. అటు కేంద్ర పెద్దలు కూడా ఆరా తీయడం ప్రారంభించారు. పవన్ అసంతృప్త కామెంట్స్ కి ఉలిక్కి పడ్డారు. వైసీపీని కట్టడి చేయడంతో పాటు జనసేనాని పవన్ ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇంతవరకూ పవన్ ను లైట్ తీసుకుంటూ వచ్చిన జగన్ కు బొమ్మ కనిపించింది. మైండ్ బ్లాక్ అయ్యింది.

2014 ఎన్నికల్లో జగన్ ఓటమి చవిచూశారు. ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. కానీ తన రాజకీయ తంత్ర విద్యలను మరింత రాటుదేల్చుకున్నారు ఆ సమయంలోనే. అయితే పేరుకే ప్రతిపక్షం కానీ దూకుడ్ని కూడా తగ్గించలేదు. రాజకీయ వ్యూహదారుడు పీకే ఆలోచనలను అమలుచేస్తూ సక్సెస్ ఫుల్ లీడర్ గా కనిపించారు. ఎటువంటి వ్యూహాన్నైనా అమలుచేయగల నాయకుడిగా బిల్డప్ చేసుకున్నారు. ఎదురుగా ఉన్నది 40 ఈయర్ష్ ఇండస్ట్రీ చంద్రబాబు అయినా.. స్వపక్షంలో విపక్షంగా ఉన్న రఘురామ కృష్ణంరాజు అయినా ఒకేలా ట్రీట్ మెంట్ ఇచ్చారు. అదే కోవలోకి పవన్ కూడా వస్తారని భావించారు. తన మందీ మార్భలాన్ని ఊసిగొలిపారు. పవన్ ఏం చేస్తాడులే అన్నట్టు భావిస్తూ వచ్చారు. విశాఖ నుంచి బలవంతంగా పంపించానని కూడా ఆనందించారు. కానీ విశాఖ వెళుతూ వెళుతూనే పవన్ జగన్ కు చుక్కలు చూపించారు.
గత ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్ల పవన్ ఓటమి చవిచూశారు. అటు భీమవరంతో పాటు ఇటు గాజువాకలో పోటీచేసినా నిరాశే ఎదురైంది. అప్పటి నుంచి పవన్ ను ఏపీ సీఎం జగన్ లైట్ తీసుకున్నారు. రాజకీయాలను వదిలి తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతాడంటూ భావించారు. కానీ పవన్ మొండి ధైర్యంతో నిలబడ్డారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును రాజకీయాలకు వినియోగిస్తున్నారు. సొంత నిధులతోనే ప్రజలకు ఇతోధికంగా సాయం చేస్తున్నారు. చివరకు విపత్తుల సమయంలో ప్రభుత్వాలకే నేరుగా కోట్లాది రూపాయలు అందించారు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నకౌలురైతు కుటుంబాలకు సైతం సాయం చేస్తున్నారు. దీంతో ఇలా కాదు పవన్ కు తమ మార్కు రాజకీయమైన ఎదురుదాడిని చూపించి భయపెట్టాలని చూశారు. కానీ ఇక్కడ మాత్రం జగన్ అంచనా తప్పింది. పవన్ ముందు జగన్ కుప్పిగెంతులు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. పవన్ ను కెలికి జగన్ ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందులు కొని తెచ్చి పెట్టుకున్నట్టయ్యింది. జగన్ చిరకాల ప్రత్యర్థులు ఒకే గూటికి చేరుతున్నారు. అటు కేంద్రం కూడా సహాయ నిరాకరణ ప్రారంభించింది. అంటే పవన్ తో పెట్టుకొని జగన్ ఏరికోరి కష్టాలను తెచ్చుకున్నారన్న మాట.
