Srireddy: నోరు తెరిస్తే బూతులు మాత్రమే మాట్లాడే శ్రీరెడ్డి మరోసారి గలీజు పదాలతో వీడియోలో కనిపించింది. జనసేన అధినేత పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకుల కంటే ముందుగానే ఈమె రియాక్టయింది. పచ్చి బూతులతో పవన్ పై తీవ్ర విమర్శలు చేసింది. పద పదానికి బూతు వాడుతూ తన జగనన్న జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ కామెంట్ చేసింది. అయితే సోషల్ మీడియాలో లేటెస్టుగా ఓ వీడియోలో ఇలా మాట్లాడిన శ్రీరెడ్డిపై రెస్పాండ్ కావడానికి పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే ఆన్సర్ ఇచ్చారు. ‘శ్రీరెడ్డికి మైండ్ మళ్లీ దొబ్బిందా? పవన్ ఫ్యాన్స్ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అంటూ పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఇటీవల విశాఖలో పర్యటించిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను ‘జనవాణి’ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసిన వైసీపీ నాయకులపై ఫైర్ అయ్యాడు. ఇన్నాళ్లు చాలా ఓపిగ్గా ఉన్న పవన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాస్త కటువు పదాలనే ఉపయోగించి ఇక నుంచి యుద్ధం చేయడమేనన్నట్లు సంకేతాలిచ్చారు. పవన్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు, కార్యకర్తల్లో ఎమోషన్ ఏరులై పారింది. దీంతో తమ నేత ఇక సీరియస్ గా రాజకీయాల్లోకి వస్తుండడంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రత్యర్థులు రియాక్ట్ కాలేదు. కానీ తాను జగనన్న చెల్లినని చెప్పుకునే శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చారు. వచ్చీ రాగానే బూతు పదజాలంతో తిట్ల దండకం మొదలుపెట్టింది. తన చేతిలోని చెప్పును చూపిస్తూ ‘ఇది బాటా చెప్పు.. దీంతో కొట్టానంటే మాములుగా ఉండదని రెచ్చిపోయింది. నన్ను ఎవడు తిడుతాడో తిట్టండి.. నాకేం సిగ్గులేదు.. సిగ్గులేనిదినకే తెడ్డె లింగం.. భయపడేది లేదు.. అంటూ శ్రీరెడ్డి తన బూతు పురాణానన్నంతా బయటపెట్టింది.

అయితే శ్రీరెడ్డి చేసిన లైవ్ వీడియోపై ఫ్యాన్స కోపం కట్టలు తెగుతోంది. భవిష్యత్ తో శ్రీరెడ్డికి కష్టకాలమే ఉందని అంటున్నారు. ఒక పార్టీకి అధినేతనే కాకుండా అశేష అభిమానులున్న పవన్ ను శ్రీరెడ్డి మరీ ఇలా అనడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలోనూ శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ రకరకాల పోస్టులుపెట్టారు. ఎదురుదాడి కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేశారు.
ఇన్నాళ్లు సాదాసీదాగా రాజకీయ నాయకుడిగా కనిపించిన పనవ్ మొన్నటి ఆగ్రహంతో ఇక ఎలాంటి విమర్శలు తనపై ఉంచుకోలేడని తెలుస్తోంది. ఇప్పటికే తనను మూడు పెళ్లిళ్లు అని కామెంట్ చేసిన వారిపై.. మీరు కూడా భరణం చెల్లించి మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. అంటూ వారికి సమాధానం చెప్పారు. అటు తనను ప్యాకేజీ స్టార్ అన్నవాళ్లపై ‘రండి నా కొడకల్లారా.. మీకు సమాధానం చెబుతా..’ అంటూ ఊగిపోతూ తన ఆదాయం, ఖర్చు వివరాలన్నీ బయటపెట్టారు. ఇప్పుడు శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా పవన్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కానీ అంతకంటే ముందే పవన్ ఫ్యాన్స్ ఆయనకు అండగా ఉన్నామని సమాధానం ఇస్తున్నారు. దీంతో ముందు ముందు ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి..