https://oktelugu.com/

కరోనా కట్టడిలో జగన్ మరో విప్లవాత్మక నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నిర్వహణలో గొప్ప చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పదకొండు లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించి దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ఇక వెయ్యికి పైగా అంబులెన్సులు అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం చాలా ముందుంది.ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారీగా నిధులు కేటాయిస్తూ జగన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 12, 2020 / 08:21 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నిర్వహణలో గొప్ప చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పదకొండు లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించి దేశంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ఇక వెయ్యికి పైగా అంబులెన్సులు అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి జాతీయ స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొరోనాను కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం చాలా ముందుంది.ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారీగా నిధులు కేటాయిస్తూ జగన్ ప్రజారోగ్యం పట్ల తన చిత్తశుద్ధి చాటుకుంటున్నారు. లాక్ డౌన్ సడలింపుల కారణంగా ఎంత తీవ్ర కృషి చేసినా వైరస్ అదుపులోకి రావడం లేదు.

    టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

    కాగా ఈ మహమ్మారిని అరికట్టడంలో భాగంగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 20 మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్లను ప్రారంభించనున్నారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలలో ఈ కరోనా టెస్టింగ్ వాహనాలు చేరుకొని టెస్టులు నిర్వహించనున్నాయి. అత్యాధునిక టెస్టింగ్ పరికరాలతో కూడిన ఈ వాహనాలు ప్రజల వద్దకే పోయి..కరోనా ప్రభావిత ప్రాంతాలలో టెస్టులు నిర్వహిస్తాయీ. కరోనా సోకిన వ్యక్తిని గుర్తించే సరికే, జరగాల్సిన నష్టం జరిగిపోతున్న క్రమమంలో జగన్ ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకే సారి పది మందికి కరోనా టెస్టులు నిర్వహించగలిగిన సామర్ధ్యం ఈ వాహనాలలో పొందుపరిచారు. అలాగే శాంపిల్ సేకరించిన 3-4 గంటల వ్యవధిలో ఫలితాలు తెలిసేలా సాంకేతికత ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ ద్వారా చాలా వరకు కరోనాను కట్టడి చేయగలం అని అధికారులు నమ్ముతున్నారు. వీటి సంఖ్య 20 నుండి 50కి పెంచనున్నట్లు సమాచారం అందుతుంది. రెడ్ మరియు కంటైన్మెంట్స్ జోన్స్ లో ఈ మొబైల్ కరోనా టెస్టింగ్ యూనిట్స్ విరివిగా పరీక్షలు నిర్వహించనున్నాయి.

    జగన్ పై తగ్గిన పవన్ విమర్శలు జోరు…కారణం?

    ఇక గడచిన 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 1933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 1914కాగా, ఇతర రాష్ట్రాలవారు 18, ఒకరు విదేశాల నుండి వచ్చారు. ఇప్పటి వరకు ఏపీలో రికార్డు స్థాయిలో 11,53,849 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 నాలుగు గంటల్లో 20మంది మృత్యువాతపడ్డారు. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా వలన మరించిన వారి సంఖ్య 328మందికి చేరింది.