‘రాజధాని’ విషయంలో 17 తరువాత ఏం జరుగుతోంది..?

రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేసిన వైసిపి ప్రభుత్వానికి ఇప్పుడు ఆ దిశగా అవకాశం వచ్చినట్లు భావిస్తున్నారు. ఇన్నాళ్లు చట్టపరమైన సమస్యలతో రాజధాని తరలింపు సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. తరలింపునకు రెండు ముహుర్తాలను నిర్ణయించి వాయిదా వేసింది. త్వరలో ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 17 అనంతరం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఎ రద్దు బిల్లు సాంకేతికంగా మండలిలో ఆమోదించినట్లేననేది ఈ వాదన […]

Written By: Neelambaram, Updated On : July 12, 2020 11:16 pm
Follow us on


రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరాన్ని ఎంపిక చేసిన వైసిపి ప్రభుత్వానికి ఇప్పుడు ఆ దిశగా అవకాశం వచ్చినట్లు భావిస్తున్నారు. ఇన్నాళ్లు చట్టపరమైన సమస్యలతో రాజధాని తరలింపు సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. తరలింపునకు రెండు ముహుర్తాలను నిర్ణయించి వాయిదా వేసింది. త్వరలో ఆ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 17 అనంతరం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఎ రద్దు బిల్లు సాంకేతికంగా మండలిలో ఆమోదించినట్లేననేది ఈ వాదన వెనక ఉన్న అసలు విషయం. జూన్ నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లును మండలికి 17వ తేదీన రెండవ సారి పంపించింది. టిడిపి ఈ వ్యవహారంపై అభ్యంతరం చెప్పడంతోపాటు మండలిలో చర్చ జరగకుండా మండలిని నిరవధిక వాయిదా పడే విధంగా చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, టిడిపి ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది.

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

ప్రభుత్వం ఏ బిల్లును అయినా రెండవ సారి మండలికి పంపినప్పడు అది చర్చ జరిగినా, జరగకపోయినా, తిరస్కరించినా, సవరణకు ప్రతిపాధించినా 30 రోజుల అనంతరం ఆమోదించినట్లుగా భావించే అవకాశం ఉండటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. మొదటి సారి బిల్లు పంపితే దానిపై ఆమోదం తెలపకుండా, ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే 14 రోజుల అనంతరం ఆమోదించినట్లుగా భావించేందుకు అవకాశం ఉంది. ఇటీవల ద్రవ్య వినిమయ బిల్లును అదే విధంగా ఆమోదం పొందినట్లు భావించడంతో కొంత ఆలస్యంగా ఈ నెల జీతాలను ప్రభుత్వం చెల్లించగలిగింది. ఇదే తరహాలో రెండవ సారి మండలికి వెళ్లిన బిల్లుపై మండలిలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే 30 రోజుల అనంతరం ఆమోదం పోందినట్లుగా భావించే వెసులుబాటు ఉండటంతో ఈ రెండు బిల్లులు ఈ నెల 17 తరువాత ఆమోదం పొందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ రెండు బిల్లులకు ఆమోదం లభిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని తరలింపునకు ఉన్న ఏకైక అవరోదం తొలగిపోయినట్లే. రాజధాని తరలింపు అక్కడి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పై విచారాణ జరిగిన సందర్భంగా పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులు ఆమోదం పొందేవరకూ రాజధానిని తరలించేది లేదని ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం బిల్లులు ఆమోదించే వరకూ రాజధానికి తరలించే అవకాశం లేదు. ఇప్పడు బిల్లులు ఆమోదం పొందితే ప్రభుత్వానికి చట్టపరంగా ఎటువంటి సమస్య ఉండదు.

రాజధాని తరలింపును ఎట్టిపరిస్థితుల్లోను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశగా ముందుకు వెళుతుంది. చట్ట పరంగా అవకాశం లేకపోతే న్యాయపరంగానైనా అడ్డుకోవాలని భావిస్తోంది. దీంతో టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఇప్పటికే పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మెన్ ఆదేశాలను మండలి కార్యదర్శి పాటించడం లేదని హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ ప్రారంభించగా ఇరువర్గాలు వారి వాధనలు వినిపించాయి. అయితే హై కోర్టులో విచారణ పూర్తి కాలేదు. ఈ కేసు విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉందని భావించిన టిడిపి ఎమ్మెల్సీ సుప్రీం కోర్టులను మరో పిటీషన్ దాఖలు చేశారు.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

మరోవైపు రాజధాని తరలింపు అధికారికంగా జరగకపోయినా అవసరమైన ఏర్పాట్లు చాపకింద నీరులా జరిగిపోతున్నాయి. ఈ రోజు కాపకోతే రేపు అయినా రాజధాని తరలింపు తప్పదని తెలిసిన అధికారులు అందుకు అవసరమైన ఏర్పట్లు చేసుకుపోతున్నారు. సిఎంఓకు చెందిన కొంత పర్నీచర్ విశాఖ గేహౌండ్స్ కార్యాలయానికి గతంలోనే తరలించారు. కొద్ది రోజుల కిందట విశాఖ సముద్ర తీరంలో సచివాలయం, సిఎంఓ కార్యాలయాల నిర్మాణానికి అనువైన భూములను సిఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అర్కియాలజీ నిపుణులతో కలిసి పరిశీలించారు. వాస్తవానికి విజయదశమి రాజధాని తరలింపునకు ముహూర్తంగా విశాఖ స్వామీజీ నిర్ణయించారని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చాయి. గతంలో రెండు మూహూర్తాలు కరోనా వల్ల వాయిదా పడటంతో ఈ సారి దసరా పర్వదినమైన విజయదశమిని నిర్ణయించారు. ప్రస్తతం పాలనా వికేంద్రీకరణ, సిఆర్డీఎ రద్దు బిల్లు ఆమోదం పొందినా రాజధాని విశాఖలో ఈ ముహుర్తానికే తరలించే అవకాశం ఉంది.