https://oktelugu.com/

అమితాబ్ కుటుంబానికి అలానే కరోనా వచ్చింది !

కరోనా మహమ్మారి దెబ్బకు బాలీవుడ్ మరింతగా భయ పడాల్సిన పరిస్థుతులు వచ్చేసాయి. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్ కి నిన్న రాత్రి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా భారతీయ సినీ పరిశ్రమలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ రోజు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో పాటు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని రావడంతో ఐశ్వర్య రాయ్ అభిమానులతో పాటు యావత్తు భారతీయ […]

Written By:
  • admin
  • , Updated On : July 12, 2020 / 07:54 PM IST
    Follow us on


    కరోనా మహమ్మారి దెబ్బకు బాలీవుడ్ మరింతగా భయ పడాల్సిన పరిస్థుతులు వచ్చేసాయి. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో పాటు అభిషేక్ బచ్చన్ కి నిన్న రాత్రి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా భారతీయ సినీ పరిశ్రమలు ఉలిక్కిపడ్డాయి. అయితే ఈ రోజు మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో పాటు ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ కు కూడా కరోనా పాజిటివ్ అని రావడంతో ఐశ్వర్య రాయ్ అభిమానులతో పాటు యావత్తు భారతీయ సినీ లోకం షాక్ గురైంది.

    అసలు ‘బిగ్ బీ అమితాబ్ బచ్చన్’ కుటుంబంలో కరోనా కలకలం సృష్టించడానికి కారణం ఓ యాడ్ ఫిల్మ్ తాలూకు ప్యాచ్ వర్క్ అని తెలుస్తోంది. ఆ మధ్య అమితాబ్ ఓ యాడ్ ఫిల్మ్ చేశారు. దాని బ్యాలెన్స్ వర్క్ ఉండటంతో ఇటివలె అమితాబ్ ఆయన ఇంటిలోనే షూట్ లో పాల్గోన్నారు. దాంతో ఆ షూట్ లోనే ఆయనకు కరోనా సోకి ఉంటుందని ఆయన ద్వారా మిగిలిన కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉంటుందని తెలుస్తోంది.

    ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ నానావతీ హాస్పిటల్ లో కరోనా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఐశ్వర్య రాయ్ మరియు ఆమె కూతురు ఆరాధ్య కూడా నానావతి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం అందుతుంది. ఏమైనా అమితాబ్ కుటుంబం పై ఇలా కరోనా దండెత్తడం అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేస్తోంది.

    Also Read: ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురుకూ కరోనా