https://oktelugu.com/

Jagan Stickers : ఇంటికి, ఒంటికి జ‌గన్ స్టిక్క‌ర్లు.. ఏపీ కొత్త ప్ర‌యోగం !

Jagan Stickers : ఏపీలో అధికారం వెర్రి త‌ల‌లు వేస్తోంది. క‌న్ను మిన్ను కాన‌కుండా మ‌దంతో విర్ర‌వీగుతోంది. ఎక్క‌డా లేని సంప్రదాయాన్ని ప్ర‌జ‌ల పై రుద్దుతోంది. సొంత డ‌బ్బుతో జ‌నాన్ని పోషిస్తున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇన్నాళ్లు పార్టీ జెండా రంగుల‌తో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ముంచెత్తారు. ఇప్పుడు జనం పై ప‌డ్డారు. అధికార పార్టీ వికృత విన్యాసాల‌తో జ‌నం బెంబేలెత్తుతున్నారు. ఏపీలో అధికార పార్టీ విన్యాసాలు చెప్ప‌న‌ల‌వి కానివి. వీధి కొళాయి ప్రారంభించి.. ఓ వంద కోట్ల ప్రాజెక్టు ప్రారంభించిన‌ట్టు ఓ […]

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : February 12, 2023 / 04:36 PM IST
    Follow us on

    Jagan Stickers : ఏపీలో అధికారం వెర్రి త‌ల‌లు వేస్తోంది. క‌న్ను మిన్ను కాన‌కుండా మ‌దంతో విర్ర‌వీగుతోంది. ఎక్క‌డా లేని సంప్రదాయాన్ని ప్ర‌జ‌ల పై రుద్దుతోంది. సొంత డ‌బ్బుతో జ‌నాన్ని పోషిస్తున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇన్నాళ్లు పార్టీ జెండా రంగుల‌తో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ముంచెత్తారు. ఇప్పుడు జనం పై ప‌డ్డారు. అధికార పార్టీ వికృత విన్యాసాల‌తో జ‌నం బెంబేలెత్తుతున్నారు.

    ఏపీలో అధికార పార్టీ విన్యాసాలు చెప్ప‌న‌ల‌వి కానివి. వీధి కొళాయి ప్రారంభించి.. ఓ వంద కోట్ల ప్రాజెక్టు ప్రారంభించిన‌ట్టు ఓ మంత్రి చంక‌లు గుద్దుకుంటుంది. ఇంకో మంత్రి కోడి, గుడ్డు, పెట్ట అంటూ పొంత‌న లేని పోలిక‌ల‌తో జనాన్ని హింసిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కాద‌న్న‌ట్టు… ఏపీ ప్ర‌భుత్వం కొత్త విన్యాసానికి తెర‌తీసింది. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ఇంటికి జ‌గ‌న‌న్న స్టిక్క‌ర్లు అంటించాల‌ని సిద్ధ‌మైంది. జ‌గ‌న‌న్న న‌మ్మ‌కం పేరుతో ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు, సెల్ ఫోన్ల‌కు స్టిక్క‌ర్లు అంటించాల‌ని స‌మాయ‌త్తం అవుతోంది. ఇలాంటి ఐడియాలు ఎవ‌రిస్తోరో కానీ.. వారికి హాట్సాఫ్ చెప్ప‌కుండా ఉండ‌లేం.

    అప్పుల‌ను ప‌ప్పులు బెల్లాల్లా పంచుతూ సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తున్నారు. అందులో జ‌గ‌న్ క‌ష్టం రూపాయి కూడా లేదు. క‌నీసం సంప‌ద సృష్టించి.. అందులో నుంచి సంక్షేమ ప‌థకాలు పంచి పెడితే ఒప్పుకోవ‌చ్చు. కానీ అప్పులు తెచ్చి .. ఆ అప్పులు పంచి పెట్టి.. మ‌ళ్లీ ఆ అప్పులు జనం నెత్తి పై రుద్ది.. స్టిక్క‌ర్లు అంటించుకోమ‌న‌డం ఎంత హాస్యాస్ప‌దం. కాంగ్రెస్ హ‌యాంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూడా ఇలాంటి ప్ర‌య‌త్నమే ఒక‌టి చేశారు. అది చూసి జ‌గ‌న్ స్పూర్తి పొందిన‌ట్టు ఉన్నారు. అప్ప‌ట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్రం ఉమ్మ‌డిగా ఉంది. కాంగ్రెస్ విరివిగా ఇందిర‌మ్మ ఇళ్లు పంపిణీ చేసింది. కానీ ఇళ్ల‌కు బిల్లు కావాలంటే కాంగ్రెస్ మూడు రంగులు వేసుకోవాలంటూ ష‌ర‌తు పెట్టింది. అప్పుడు జ‌నం నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌యింది. చాలా మంది మూడు రంగులు వేసుకోవ‌డానికి ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్ర‌య‌త్నం ఆగిపోయింది.

    ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జ‌నం సొమ్ము జ‌నానికే పంచి పెడుతూ జ‌గ‌న్ స్టిక్క‌ర్లు అంటించుకోమ‌ని స‌ల‌హా ఇస్తున్నారు. స‌ల‌హా కాదు క‌చ్చితంగా అంటించుకోవాల‌ని అంటారేమో. నిజంగా ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థకాలు అందితే జనం ఓటెయ్య‌కుండా ఉండ‌రు. తాము ఇచ్చిన ప‌థ‌కాల పై ప్ర‌భుత్వానికి న‌మ్మ‌కం ఉంటే ఇలాంటి విన్యాసాలు కూడా అవ‌స‌రం లేదు. కానీ ప్ర‌భుత్వానికి ఎక్క‌డో లోలోప‌ల త‌మ ప‌థ‌కాల పై, ప్ర‌భుత్వ తీరు పై అనుమానం ఉన్న‌ట్టు ఉంది. అందుకే స్టిక్క‌ర్ల పేరుతో ఒక ర‌క‌మైన పాజిటివ్ వేవ్ జ‌నంలో సృష్టించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. నిత్యం జ‌గ‌న్ బొమ్మ చూస్తూ ఉంటే.. అది జ‌గ‌న్ పట్ల పాజిటివ్ థింకింగ్ గా మారుతుంద‌ని .. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ పట్ల సానుకూల వైఖ‌రి ఏర్పడుతుంద‌ని వైసీపీ న‌మ్ముతోంది. అందుకే జ‌నం సైకాల‌జీ పై ప్ర‌యోగాలు చేస్తోంది.

    జ‌గ‌న్ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. ప‌థ‌కాలు అందించి ఉంటే.. ఇలాంటి ప్ర‌య‌త్నాలు అవ‌స‌రం లేదు. ఇంట్లో కూర్చున్నా జ‌గన్ మ‌ళ్లీ గెలిచి వ‌స్తారు. కానీ ఎప్పుడైతే అనుమానం ఉంటుందో.. అప్పుడే ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తారు. జ‌నం పై బ‌లవంతంగా రుద్దాల‌ని ప్ర‌య‌త్నం చేస్తారు. ఇష్టం లేక‌పోతే ఎంత బ‌ల‌వంతంగా రుద్దినా జ‌నం ఓటేయ‌ర‌న్న వాస్త‌వాన్ని జ‌గ‌న్ గ్ర‌హించాలి. గ‌తంలో ఏ పార్టీ చేయ‌ని కొత్త ప్ర‌యోగాల‌ను చేయ‌డం వల్ల ఒరిగేది ఏమీ లేద‌ని తెలుసుకోవాలి. నిజంగా ప్ర‌జ‌లు ల‌బ్ధి పొందితే గుండెల్లో పెట్టుకుంటారు. బ‌ల‌వంతంగా మ‌నం స్టిక్క‌ర్లు అంటించాల్సిన ప‌నిలేదు.